Begin typing your search above and press return to search.

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో బాబుకు ఈడీ క్లీన్ చిట్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు ఓ కీలక అధ్యాయం అనే చెప్పాలి.

By:  Tupaki Desk   |   16 Oct 2024 7:03 AM GMT
స్కిల్  డెవలప్మెంట్  స్కామ్  కేసులో బాబుకు ఈడీ క్లీన్  చిట్!
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు ఓ కీలక అధ్యాయం అనే చెప్పాలి. ఏపీ రాజకీయాల్లో ఈ కేసు ఓ సంచలనం. ఈ కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ చేసింది సీఐడీ. దీంతో.. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో సుమారు 52 రోజులపాటు రిమాండ్ లో ఉన్నారు.

అయితే... ఈ కేసులో ఈడీ చేసిన ప్రకటన కీలకంగా మారింది. ఈడీ తాజా విచారణ అనంతరం.. ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎలాంటి ప్రమేయం లేదని రుజువైందని అంటున్నారు. ఈడీ విచారణ ప్రకారం నిధుల డైవర్షన్ విషయంలో సీఎం ప్రమేయం లేదని నిరూపణ అయిందని చెబుతున్నారు.

అవును... ఏపీలో సంచలన సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో తాజా ఆస్తుల అటాచ్ మెంట్ లో సీఎం చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని ఈడీ స్పష్టం చేసిందని చెబుతున్నారు. వినాయ ఖాన్వేల్కర్, సుమన్ బోస్ సహా పలువురు బోగస్ ఇన్ వాయిస్ లు సృష్టించి ఈ పనికి పాల్పడినట్లు గుర్తించారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో... చంద్రబాబు వ్యతిరేకంగా ఒక్క అంశం కూడా ఈడీ తాజా స్టేట్ మెంట్ లో నమోదు కాలేదని.. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబుకు కానీ, ఆయనకు సంబంధించిన వారికి డబ్బులు అందినట్లు ఎక్కడా చూపించలేదని అంటున్నారు. దీంతో... ఈ కేసులో బాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్లే అయ్యిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

కాగా... 2023 సెప్టెంబర్ 9న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో నాటి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబును నంద్యాలలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తరలించారు. దీంతో... బాబుకు ఏసీబీ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

దీంతో... రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబుని తరలించారు పోలీసులు. ఇంటి నుంచే భోజనం, మెడిసిన్స్ తీసుకునే సౌలభ్యంతో చంద్రబాబు అదే జైల్లో సుమారు 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం బాబు బెయిల్ పై విడుదలయ్యారు.