సూపర్ సిక్స్-1: పేరు-ఊరు.. రెండూ గొప్పే.. !
తొలిదఫా సూపర్ సిక్స్‌లో భాగంగా.. ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ నెల 31న చంద్రబాబు దీనిని ప్రారంభించనున్నారు.
By: Tupaki Desk | 29 Oct 2024 5:02 AM GMTకొన్ని కొన్ని ప్రభుత్వ పథకాలు పేరు గొప్ప ఊరు దిబ్బ! అన్నట్టుగా ఉంటాయన్న వాదన ఉంది. గతంలో వైసీపీ అమలు చేసిన పథకాలు కూడా.. ఒకటి రెండు ఇలానే ఉన్నాయి. ఉదాహరణకు.. అర్బన్ ప్రాంతా లలో మధ్య తరగతి ఉద్యోగులు, వ్యాపారుల కోసం.. జగన్ ప్రభుత్వం ఇళ్లు నిర్మించాలని భావించింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. 40 శాతం సొమ్ము మీరు కడితే.. 60 శాతం ప్రభు త్వమే భరిస్తుందని కూడా చెప్పారు.
కానీ, ఎవరూ ముందుకు రాలేదు. ఇది వైసీపీ సర్కారుకు మధ్యతరగతి ఓటుబ్యాంకు ఏమేరకు చేరువైంద నే విషయాన్ని స్పష్టం చేసింది. అంటే.. ఒకరకంగా ఇది విఫలమైంది. ఇలా.. కొన్ని కొన్ని పథకాలు ప్రతి ప్రభుత్వానికీ పేరు తెచ్చేవి ఉంటాయి.. ఫెయిల్ అయ్యేవి కూడా ఉంటాయి. ఇక, ఇప్పుడు కూటమి ప్రభు త్వం వచ్చింది. తొలిదఫా సూపర్ సిక్స్‌లో భాగంగా.. ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ నెల 31న చంద్రబాబు దీనిని ప్రారంభించనున్నారు.
ఈ పథకం ద్వారా.. చంద్రబాబు మహిళా ఓటర్ల సానుభూతితో పాటు.. పక్కాగా మహిళల ఓట్లను టీడీపీకి అనుకూలంగా మార్చుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నారు. దీంతో మహిళల కోసమే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ నెల 29 నుంచి బుకింగ్ కూడా ప్రారంభం అవుతోంది. ఇక, ఈ పథకం ఏమేరకు సర్కారు కు మేలు చేస్తుంది? అనే విషయాన్ని పరిశీలిస్తే.. బాగానే వర్కవుట్ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.2 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.
వీటిలో ఉన్నతస్థాయి వర్గాలను తీసేసినా.. జిల్లాకు రమారమి 5 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఈ పథకం పరిధిలో కి వచ్చినా.. మొత్తంగా 15 లక్షల ఓట్లు ఎక్కడకీ పోవన్న ధీమా వ్యక్తమవుతోంది. ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇది మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేకూరుస్తుందన్న భావన అయితే.. సర్కారులో ఉంది. ఇతర పథకాల సంగతి ఎలా ఉన్నా.. ప్రస్తుతం ఇస్తున్న గ్యాస్ పథకం ఊరు-పేరు కూడా బాగానే తీసుకువస్తుందని కూటమి పార్టీలు విశ్వసిస్తున్నాయి.