బాబు @ 95- తమ్ముళ్లు @14
ఏపీ సీఎం చంద్రబాబు ఒకదారి వెళ్తుంటే.. ఆయన పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు మరో దారిలో పయని స్తున్నారు.
By: Tupaki Desk | 17 March 2025 8:00 AM ISTఏపీ సీఎం చంద్రబాబు ఒకదారి వెళ్తుంటే.. ఆయన పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు మరో దారిలో పయని స్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది. సీఎం చంద్రబాబు 1995ల నాటి ముఖ్యమంత్రిని చూస్తారని తరచుగా ప్రకటిస్తున్నారు. తాజాగా కూడా.. చెప్పుకొచ్చారు. ఆకస్మిక తనిఖీలు ఉంటాయని.. తనలో మార్పు ను చూస్తారని, ప్రజలకు చేరువ కావాలని ఆయన హెచ్చరించారు. సో.. చంద్రబాబు గతంలో తాను ఉమ్మడి రాష్ట్రంలో చేసిన పాలనను ప్రజలకు పరిచయం చేయాలని చూస్తున్నారు.
కట్ చేస్తే.. ఇది ఇప్పుడున్న వ్యవస్థలో ఎంత వరకు సక్సెస్ అవుతుందనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే.. గతంలో మాదిరిగా ఉద్యోగులు సర్దుకునే పరిస్థితి ఇప్పుడులేదు. ఉన్నతాధికారులు కూడా అంతే. తమకు నొప్పి వస్తోందంటే.. ప్లేట్ ఫిరాయించేసిన నాయకుల మాదిరిగానే ఉద్యోగ సంఘాలు కూడా తయారయ్యా యి. సో.. ఆకస్మిక తనిఖీలతో చంద్రబాబు ఏం సాధిస్తారనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం. పైగా.. ఉద్యోగుల ఆరోగ్యం కూడా సరిగా లేదు. ఈ విషయం సర్కారే చెబుతోంది.
ఈ నేపథ్యంలో వారిని టెన్షన్కు గురి చేస్తే.. మరిన్ని ప్రమాదాలు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. వాస్తవానికి 1995లో చంద్రబాబు ఆకస్మిక పర్యటనలు చేసి.. తనిఖీలు చేసినా.. అర్ధంతరంగా దానిని ఆపేసుకు న్నారు. దీనికి కారణం.. ఓ తహసీల్దార్ ఆకస్మిక తనిఖీలకు హడలిపోయి.. గుండె పోటుతో అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో బాబు దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పుడు మళ్లీ పాటపాడుతున్నారు. సరే.. సక్సెస్ కావాలనే కోరుకుందాం.
ఇక, తమ్ముళ్ల విషయానికి వస్తే.. 2014నాటి ఎమ్మెల్యేలు, నాయకులు దర్శన మిస్తున్నారు. మా ఇంటికి వస్తే ఏం తెస్తావ్.. మీ ఇంటికి వస్తే ఏం పెడతావ్? అన్నచందంగా.. పైసలు గుంజేస్తున్నారన్నది ఎవరో వైసీపీ నాయకుడు చెప్పడంలేదు. సాక్షాత్తూ.. టీడీపీని నిరంతరం భుజాలపైనా, తలపైనా మోస్తున్న పత్రికలు.. నిత్యం వండివారుస్తున్న పత్రికలే చెబుతున్నాయి. `నీకింత.. నాకంత` చందంగా తమ్ముళ్లు రాష్ట్రాన్ని పంచేసుకున్నారన్నది వాస్తవం. సో.. ఇప్పుడు ఇలాంటి వారిని మార్చకపోతే.. ముందుగా ఆకస్మిక తనిఖీలు ఎమ్మెల్యేల కార్యాలయాల వద్ద చేపట్టకపోతే.. అప్పుడు నిజమైన ప్రమాదం.. 2019లో ఎదురైనట్టు ఎదురు కాకతప్పదన్న వాదన బలంగా వినిపిస్తోంది.