నో ఆఫీస్ వర్క్... మూడో శనివారం అధికారులకు బాబు కొత్త టాస్క్!
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తన మార్కు పాలన దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 12 Dec 2024 3:30 PM GMTఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తన మార్కు పాలన దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏర్పాటు చేసిన "క్లీన్ ఏపీ" కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు ఈ దఫా "స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్" కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ ల సదస్సులో వివరాలు వెల్లడించారు.
అవును... సచివాలయంలో జరిగిన రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా గతంలో చేపట్టిన క్లీన్ ఏపీ లాగానే ఈ సారి స్వచ్చ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం గురించి వెళ్లడించారు. ఇందులో భాగంగా ప్రతీ నెల మూడో శనివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చంద్రబాబు కలెక్టర్ లకు సూచించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు... స్వచ్ఛ్ ఆంధ్ర ను ఓ క్యాంపెయిన్ మోడ్ లో తీసుకెళ్తామని.. ఇందులో క్లీన్, గ్రీన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ వంటివి అన్నీ వస్తాయని తెలిపారు. ఇందులో గార్బేజ్, వెస్ట్ వేస్ట్, డ్రై వేస్ట్, లిక్విడ్ వేస్ట్ నుంచి అన్నింటినీ తొలగించి పరిశరాలను పరిశుభ్రంగా ఉంచాలని చంద్రబాబు సూచించారు.
ఈ కార్యక్రమం కోసం ఎంతమంది అవసరమైతే అంతమందిని మొబైలైజ్ చేసుకోవాలని కలెక్టర్లకు చంద్రబాబు సుచించారు. ఇక, ఆ రోజు అధికారులు ఎవరూ పని చేయాల్సిన అవసరం లేదని.. వాళ్ల వాళ్ల కార్యాలయాలు క్లీన్ గా పెట్టుకోవాలని.. ఆలోచనా విధానంలో కూడా మార్పు తీసుకురావాలని.. లెగసీ తీసుకురావాలని బాబు కోరారు.
ఈ కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా తీసుకెళ్లాలని.. ఇందులో అందరూ భాగస్వాములవుతామని చంద్రబాబు తెలిపారు. ఇది ఒక్కసారిగా ప్రజల్లో మార్పు తీసుకురాదు కానీ.. ఒక లెగసీ క్రియేట్ అవుతుందని అన్నారు.