Begin typing your search above and press return to search.

అడ్డంగా దొరికేసిన ఎమ్మెల్యేలు!.. చంద్రబాబు చండ్ర నిప్పులు!

అవును... ప్రస్తుతం రాజకీయాలు బాగా మారిపోయాయి. నేతలు ఎవరైనా మాట తప్పినా, తప్పులు చేస్తున్నా ప్రజలు ఏమాత్రం మరిచిపోవడం లేదు

By:  Tupaki Desk   |   16 Oct 2024 3:30 PM GMT
అడ్డంగా దొరికేసిన ఎమ్మెల్యేలు!.. చంద్రబాబు  చండ్ర నిప్పులు!
X

చెప్పిన మాట వింటే చంద్రబాబు అంత మంచోడు లేరని.. తోక చాడించి, తెరవెనుక వేషాలు వేస్తే ఆ తోకలు కత్తిరించే విషయంలో ఆయనంత స్ట్రాంగ్ మరెవరూ ఉండరని చెబుతుంటారు చాలా మంది! ఈ నేపథ్యంలో కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలకు తాజాగా రెండో అనుభవం ఎదురైందని అంటున్నారు. అందుకు కారణాలు.. టెండర్లలో తమ్ముళ్లు వెళ్లు పెట్టడాలు!

అవును... ప్రస్తుతం రాజకీయాలు బాగా మారిపోయాయి. నేతలు ఎవరైనా మాట తప్పినా, తప్పులు చేస్తున్నా ప్రజలు ఏమాత్రం మరిచిపోవడం లేదు.. మనసులో పెట్టుకుంటున్నారు.. టైం వచ్చినప్పుడు తాట తీసేస్తున్నారు! అయితే అధికారంలో ఉన్నామనే ధైర్యంతో చాలా మంది ఎమ్మెల్యేలు ఈ విషయం మరిచిపోయి.. చంద్రబాబు చెప్పినా వినలేదని అంటున్నారు.

వివరాళ్లోకి వేళ్తే... నేతలు ఎవరూ లిక్కర్, ఇసుక టెండర్లలో ఇష్టారాజ్యంగా వ్యవహరించకూడదంటూ చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు! అయితే.. అమరావతిలో ఉన్న చంద్రబాబుకు నియోజకవర్గంలో తాము చేస్తున్న వ్యవహారాలు ఎలా తెలుస్తాయిలే అనుకున్నారో ఏమో కానీ.. ఓ 18 మంది ఎమ్మెల్యేలు బాబు కళ్లుగప్పి సొంత పెత్తనాలు చేశారట.

అయితే... బాబు తనదైన నిఘాతో ఆ విషయం తెలుసుకోగలిగారని అంటున్నారు. ప్రస్తుతం వీరిపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. ఎవరైనా మద్యం, ఇసుక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని హెచ్చరించినా.. కొంతమంది ఎమ్మెల్యేల తీరు మారలేదని బాబు ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే బాబు నేతలతో భేటీ ఏర్పాటు చేశారు!

ఈ విషయంపై చంద్రబాబు సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. అవినీతి, అధికార దుర్వినియోగానికి సంబంధించిన వ్యవహారాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి వారి కుటుంబ సభ్యులూ ఎక్కడా తల దూర్చడానికి వీలు లేదని ఆయన గట్టిగా చెప్పారని అంటున్నారు! మరోవైపు ఇప్పటికే మద్యం, ఇసుక వ్యవహారాల్లో అధికార పార్టీ అవినీతికి పాల్పడుతోందంటూ ఆరోపణలు చేస్తోంది విపక్షం.

ఈ నేపథ్యంలో... ఈ వ్యవహారంపై బాబు సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. సుమారు 18 మంది ఎమ్మెల్యేల ప్రవర్తన విసిగిస్తోందని చంద్రబాబు తన సన్నిహితుల వద్ద అన్నట్లు పార్టీలో చర్చ నడుస్తుందని తెలుస్తోంది. వీరి విషయంలో మెతక వైఖరి అవలంభిస్తే గతంలో చేసిన తప్పులను పునరావృతం చేసినట్లవుతుందని బాబు భావిస్తున్నారని చెబుతున్నారు!