15 % గ్రోత్-4-పీ.. రూటు మార్చిన చంద్రబాబు!
ఏపీ సీఎం చంద్రబాబు రూటు మార్చారు. మళ్లీ విజన్ దిశగా అడుగులు వేయడం ప్రారంభించారు.
By: Tupaki Desk | 4 Oct 2024 7:30 AM GMTఏపీ సీఎం చంద్రబాబు రూటు మార్చారు. మళ్లీ విజన్ దిశగా అడుగులు వేయడం ప్రారంభించారు. నిన్న మొన్నటి వరకు అంటే సెప్టెంబరు మాసం అంతా కూడా రెండు కీలక విషయాలతోనే పాలన సరిపోయిం ది. దీంతో ప్రభుత్వం పరంగా పెద్దగా ఏమీ చేయలేకపోయారు. ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోలేక పోయారు. సెప్టెంబరు 1 నుంచి 15 వరకు రాష్ట్రంలో వరదలు, తుఫానులతోనే కాలం గడిచిపోయింది. వీటి నుంచి ప్రజలను రక్షించడం.. సమీక్షలు.. సాయం అంటూ కాలం కరిగిపోయింది.
దీనికితోడు కృష్ణానదిలో 4 ఐరన్ పడవల వ్యవహారం కూడా సర్కారుకు తలనొప్పిగా మారింది. ఈ విషయాల నుంచి కొంత బయటకు వచ్చే సమయంలో ఆ తర్వాత.. 15 రోజులు కూడా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం తెరమీదికి వచ్చింది. ఈ పరిణామాలతో సెప్టెంబరు మాసం అంతా కూడా గడిచి పోయింది. ఇక, ఇప్పుడు అక్టోబరు ప్రారంభం నుంచి చంద్రబాబు రూటు మార్చేశారు. ముందుగానే నిర్దేశించుకున్న మేరకు నూతన మద్యం విధానాన్ని తీసుకువచ్చారు.
అదేవిధంగా ఇప్పుడు కీలకమైన రెండు నిర్ణయాలను అమలు చేసే దిశగా అడుగులు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు, ప్రాజెక్టుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా పీ-4 పథకానికి ఆయన పచ్చ జెండా ఊపారు. దీని ప్రకారం.. పబ్లిక్-ప్రైవేట్-ప్రభుత్వం-పార్టనర్ షిప్(పీ-4) కింద రహదా రులను అభివృద్ధి చేయనున్నారు. ముఖ్యంగా స్టేట్ హైవేస్‌ను ఈ పథకం కిందే డెవలప్ చేసేందుకు మార్గనిర్దేశం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఆరు మాసాల్లో రోడ్లు అద్దాల్లా మెరిసేలా నిర్ణయం తీసుకున్నారు.
ఇక, మరో కీలక నిర్ణయం గ్రోత్ రేట్‌ను 15 శాతానికి చేర్చడం. ప్రస్తుతం రాష్ట్ర గ్రోత్ రేట్ 7.8 శాతంగా ఉంది. అయితే.. మౌలిక వసతుల కల్పన,ఉ పాధి, విద్యారంగాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా.. ప్రజల ఆదాయ వృద్ధి రేటు తదనుగుణంగా రాష్ట్ర వృద్ధిని కూడా 15 శాతానికి పెంచేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. వచ్చేరెండున్నరేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తులు కూడా పెంచనున్నారు. దీంతో రాష్ట్ర వృద్ధిని 15 శాతానికి పెంచాలని నిర్ణయించారు. ఈ పరిణామాలతో చంద్రబాబు తిరిగి విజన్ దిశగా అడుగులు ప్రారంభించినట్టు అయింది.