మైండ్ బ్లాంక్ అయింది అన్న బాబు
చంద్రబాబు మొదటి సారి విశాఖ బీచ్ రోడ్డులోని రుషికొండను వెళ్లారు. ఆయన అనకాపల్లి నుంచి నేరుగా విశాఖ రుషికొండలో ల్యాండ్ అయ్యారు.
By: Tupaki Desk | 2 Nov 2024 1:51 PM GMTవిశాఖ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అక్కడకు వెళ్లాక మైండ్ బ్లాంక్ అయిందట. ఇంతకీ బాబు ఎందుకు అక్కడికి వెళ్లారు, అక్కడ వెళ్ళి తీరా ఏమి చూశారు అన్నది కనుక తెలుసుకుంటే ఆసక్తికరమే. చంద్రబాబు మొదటి సారి విశాఖ బీచ్ రోడ్డులోని రుషికొండను వెళ్లారు. ఆయన అనకాపల్లి నుంచి నేరుగా విశాఖ రుషికొండలో ల్యాండ్ అయ్యారు.
అక్కడ నుంచి ఆయన రుషికొండలో అడుగుపెట్టి అక్కడ వైసీపీ హయమలో నిర్మించిన అత్యాధునిక ప్యాలెస్ ని తిలకించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతీ చోటకు వెళ్ళి అన్నీ తెలుసుకున్నారు. ఆ ప్యాలెస్ లో బాత్ రూం టబ్ కోసం 36 లక్షలు, కమోడ్ కోసం 12 లక్షలు ఖర్చు చేశారని అనంతరం మీడియాతో మాట్లాడిన బాబు చెప్పారు.
ఇంతతి విలాస భవనాన్ని ఎవరూ ప్రపంచంలో నిర్మించలేదని బాబు అన్నారు. అవన్నీ చూసిన మీదట తనకు మైండ్ బ్లాంక్ అయింది అని ఆయన అన్నారు. దాదాపుగా పది ఎకరాల్లో ఏడు బ్లాకులలో విలాసవంతమైన భవనాలు నిర్మించారు అని ఆయన అన్నారు.
ఇవన్నీ పాలకుడు ప్రజల సొమ్ముతో కట్టారని ఇంతటి విలాసం అవసరమా అని ప్రశ్నించారు. ప్రజలు నుంచి వసూలు చేసిన సొమ్ముతో ఇంతటి దుబారా ఎవరైనా చేస్తారా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రాలో నాలుగు వందల కోట్లు పెట్టి ఉంటే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి అయ్యేవని ఆయన చెప్పారు. కానీ కేవలం తాను ఉండడానికి నిర్మించుకున్న రుషికొండ ప్యాలేస్ కి జగన్ ప్రభుత్వం 420 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం దారుణం అన్నారు.
దేశంలో రాష్ట్రపతిభవన్, అలాగే వాషింటర్ లోని వైట్ హౌస్ లో కూడా లేని విధంగా కారిడార్లు నిర్మించారు అని అన్నారు. పర్యావరణాన్న్ చిన్నాభిన్నం చేసి ఇంతటి నిర్మాణాలు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. ప్రజలు కూడా దీనిని ఆలోచించాలని ఆయన కోరారు.
మీడియా కూడా ఈ విషయం మీద ప్రజలలోచైతన్యం కలిగించాలని ఆయన కోరారు. మొత్తం రుషికొండ గదులు అక్కడ ఖరీదైన కట్టడాలను పూర్తిగా వీడియోలు తీసి ఆన్ ఓలైన్ లో పెడతామని అన్నారు. అలాగే ఎంత ఖర్చు చేశారు ఒక్కో దానికీ ఎంత దుబారా చేశారు అని కూడా తాము అక్కడ పెడతామని చెప్పారు.
ప్రజలంతా కూడా వాటిని చూడాలని వారిలో ఒక చర్చ జరగాలని ఆయన కోరారు. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి అధికారం అప్పగించరాదని ఆయన అన్నారు. రాజకీయ ముసుగులో ఇపుడు నేరస్థులు ప్రవేశిస్తున్నారు అని అన్నారు. వారు ప్రజలను మభ్యపెట్టి అధికారం అందుకుంటే ఇలాంటివే జరుగుతాయని అన్నారు.
అధికార దుర్వినియోగానికి ప్రజా ధనంతో విలాసం ఎలా చేయవచ్చు అన్న దానికి రుషికొండ ప్యాలెస్ ఒక కేస్ స్టడీ అని అన్నారు. ఈ ప్యాలెస్ ని ఇపుడు పర్యాటక శాఖ ఏ విధంగానూ మోయలేదని ఆయన అన్నారు. పర్యాటకులకు కూడా ఇది ఖరీదైన వ్యవ్హారం అన్నారు. దీనిని ఏమి చేయాలి ఎలా వాడుకోవాలి అన్నది ఆలోచిస్తున్నామని అన్నారు.
దాని కంటే ముందు వైసీపీ నాయక్త్వం మీద ప్రజలలో చర్చ సాగాలని వారికి మళ్లీ అధికారం లోకి రానీయకుండా దూరం పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒక అమ్మాయికి పెళ్ళి చేయాలీ అంటే ఎంతలా అన్నీ సేకరించి మంచి వారిని ఎంపిక చేసుకుంటామో రాజకీయాలో కూడా నాయకులను అలాగే ఎంచుకోవాలని అన్నారు. మొత్తానికి రుషికొండ ప్యాలెస్ ని చూసిన చంద్రబాబు తన మైండ్ బ్లాంక్ అయింది అని చెప్పడం విశేషం.