జగన్ తో జాగ్రత్త.. కుట్ర సిద్ధాంతం చెప్పి మరీ తమ్ముళ్లకు బాబు వార్నింగ్
జగన్ కుట్రలపై అప్రమత్తంగా లేని కారణంగానే 2019లో జరిగిన ఎన్నికల్లో నష్టపోయిన వైనాన్ని గుర్తు చేశారు.
By: Tupaki Desk | 1 March 2025 10:44 AM ISTరోటీన్ కు భిన్నంగా రియాక్టు అయ్యారు ఏపీ ముఖ్యమంత్రి కం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో జాగ్రత్తగా ఉండాలంటూ తెలుగు తమ్ముళ్లకు హెచ్చరికలు జారీ చేశారు. జగన్ కుట్ర రాజకీయాలతో కేర్ ఫుల్ గా ఉండాలని.. ఈ విషయంలో అప్రమత్తంగా లేని కారణంగానే 2019 ఎన్నికల్లో నష్టపోయిన విషయాన్ని గుర్తు చేశారు. శుక్రవారం జరిగిన టీడీఎల్పీ సమావేశంలో జగన్ కుట్ర సిద్ధాంతాల్ని వివరిస్తూ.. తమ్ముళ్లు కేర్ ఫుల్ గా ఉండాలంటూ వార్నింగ్ ఇచ్చారు.
జగన్ కుట్రలపై అప్రమత్తంగా లేని కారణంగానే 2019లో జరిగిన ఎన్నికల్లో నష్టపోయిన వైనాన్ని గుర్తు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావించిన చంద్రబాబు.. పొలిటికల్ క్రిమినల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. నేరం చేసి పక్కనోడిపై నెపం వేయటంలో వైసీపీ వారు సిద్ధహస్తులుగా పేర్కొంటూ.. వివేకా హత్య ఉదంతాన్ని వివరించారు. వివేకా హత్యకు సంబంధించి జగన్ అండ్ కో ఆడిన నాటకాలను పాయింట్ టు పాయింట్ చొప్పున బాబు వివరించటం గమనార్హం.
ఈ కుట్రల అంశంలో అప్రమత్తంగా లేని కారణంగానే 2019 ఎన్నికల్లో నష్టపోయిన వైనాన్ని గుర్తు చేసిన చంద్రబాబు.. మళ్లీ ఈసారి అలాంటి తప్పులు రిపీట్ కాకూడదన్నారు. గత ఎన్నికల ముందు గులకరాయి డ్రామాను తిప్పి కొట్టిన వైనాన్ని గుర్తు చేస్తూ.. ఎమ్మెల్యేలు యాక్టివ్ గా ఉండాలని.. సోషల్ మీడియాలొనూ భాగం కావాలన్నారు. మంచిని.. నిజాన్ని ముందే గట్టిగా చెప్పక పోతే.. వైసీపీ వారు చెడును విశ్వవ్యాప్తం చేస్తారన్నారు.
అందుకే.. జగన్ క్రిమినల్ రాజకీయాల విషయంలో తెలుగు తమ్ముళ్లు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సైతం జగన్ విషయంలో అలెర్టు చేయటం చూస్తే.. జగన్ కు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎంత అనుభవం వచ్చిందన్నది ఇట్టే అర్తం కాక మానదు.