5 కీలక నిర్ణయాలపై చంద్రబాబు తొలి సంతకాలు.. ఎప్పుడంటే!
అనంతరం.. ఆయన 5 ముఖ్యమైన అంశాలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేయనున్నారు. వీటికి సంబంధించిన అంశాలను కూడా.. మంత్రి వర్గ సభ్యులను చంద్రబాబు కూలంకషంగా వివరించారు.
By: Tupaki Desk | 12 Jun 2024 2:20 PM GMTఏపీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆవెంటనే కార్య రం గంలోకి దిగుతారని అందరూ అనుకున్నారు. కానీ, కుటుంబ సమేతంగా ఆయన బుధవారం రాత్రికి ఆయ న తిరుమల శ్రీవారిదర్శనానికి వెళ్తున్నారు. అయితే.. బుధవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో చంద్రబాబు తన ఇంట్లోనే భేటీ అయ్యారు. కొత్త మంత్రి వర్గ సభ్యులతో ఆయన చర్చలు జరిపారు. అనంతరం.. ఐదు కీలక నిర్ణయాలపై కూడా వారికి వివరించారు.
గురువారం ఉదయం శ్రీవారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత.. సాయంత్రం 4.41 గంటల సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు సచివాలయంలోని తన కార్యాలయానికి వెళ్లి పూర్తిస్థాయిలో బాధ్యతలు తీసుకుంటారు. అనంతరం.. ఆయన 5 ముఖ్యమైన అంశాలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేయనున్నారు. వీటికి సంబంధించిన అంశాలను కూడా.. మంత్రి వర్గ సభ్యులను చంద్రబాబు కూలంకషంగా వివరించారు. వీటిలో ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీలే ఉండడం గమనార్హం.
ఇవీ ఐదు అంశాలు..
1) తొలి సంతకం - మెగా డీఎస్సీ పైనే. ఎన్నకల సమయంలో చంద్రబాబు చెప్పిన హామీ ఇది. ప్రస్తుతం రాష్ట్రంలో 4-6 వేల వరకు ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయి. వీటికి సంబంధించి తొలి సంతకం చేయనున్నారు.
2) రెండో సంతకం - ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. ఎన్నికల సమయంలో చివరి 10 రోజులు ఈ అంశంపైనే ప్రచారం జరిగింది. జగన్ ప్రభుత్వం తెచ్చిన ఈ యాక్ట్‌ను తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పారు. అన్నట్టుగానే రెండో సంతకం దీనిపై చేయనున్నారు.
3) మూడో సంతకం - 4వేల రూపాయలకు పింఛన్ పెంపు. ఇది ఎన్నికలను మలుపు తిప్పిన అంశంగా విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం రూ.3 వేలుగా ఉన్న సామాజిక పింఛనును రూ.4 వేల పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
4) 4వ సంతకం - అన్న క్యాంటిన్ పునరుద్దీరణ. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఇది కూడా ఉంది. పేదలకు పట్టెడన్నం పెట్టే పథకం ఇది. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పునరుద్ధరించనున్నారు.
5) 5వ సంతకం - స్కిల్ సెన్సెక్స్ పై. స్కిల్ డెవలప్ మెంటుకు సంబంధించిన కీలక హామీ ఇది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా యువతకు, వలంటీర్లకు కూడా.. ఈ పథకం కింద శిక్షణ ఇవ్వనున్నారు. దీనికి కూడా తొలి రోజే చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.