చంద్రబాబు మీద పవన్ కి ఎంత ప్రేమ...!
ఒక విధంగా చెప్పాలీ అంటే బాబుని వేయి నోళ్ల పొగిడారు. నిజానికి చూస్తే ఈ సభలో చంద్రబాబు కూడా పవన్ ని పొగిడారు. ఆయన తన స్పీచ్ లో సైతం పవన్ ఒక ప్రభంజనం అన్నారు.
By: Tupaki Desk | 28 Feb 2024 6:41 PM GMTటీడీపీ అధినేత చంద్రబాబు మీద పవన్ కి గుండెలలో ఎంత ప్రేమ ఉందో తాడేపల్లిగూడెం సభ సాక్షిగా వెల్లడి అయింది. ఆయన ప్రతీ మాటలో చంద్రబాబు అనుభవాన్ని మెచ్చుకున్నారు. బాబు రాజకీయ ఉద్ధండుడు అన్నారు. ఆయనను పరిపాలనా దక్షుడు అన్నారు. విజనరీ అన్నారు.
ఒక విధంగా చెప్పాలీ అంటే బాబుని వేయి నోళ్ల పొగిడారు. నిజానికి చూస్తే ఈ సభలో చంద్రబాబు కూడా పవన్ ని పొగిడారు. ఆయన తన స్పీచ్ లో సైతం పవన్ ఒక ప్రభంజనం అన్నారు. కానీ పవన్ మాత్రం బాబు జైలు జీవితాన్ని అరెస్ట్ చేయడాన్ని కూడా గుర్తుకు తెచ్చి కాస్తా ఎమోషన్ అయ్యారు.
బాబు వంటి వారికే జగన్ ప్రభుత్వంలో రక్షణ లేదని ఆయన ప్రధాన బాధితుడు అని అన్నారు. అందుకే తాను బాబు కు మద్దతుగా నిలబడాల్సి వచ్చింది అని అన్నారు. ఏపీ ఈ రోజు కుక్కలు చింపిన విస్తరి మాదిరిగా ఉనందని అలాంటి ఏపీని బాబు వంటి అనుభవశాలి మాత్రమే సరైన దారిలో పెట్టి నడిపించగలరు అన్న నమ్మకంతో మిత్రుడిగా ఉన్నాను అని పవన్ మనసులోని మాట చెప్పేశారు.
ఎవరు ఏమనుకున్నా తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని పవన్ కుండబద్దలు కొట్టారు. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీని అతి పెద్ద పార్టీగా ఇదే వేదిక నుంచి పవన్ చెప్పడం విశేషం. టీడీపీకి ఉన్న క్యాడర్ వారికి ఉన్న పటిష్టమైన సంస్థాగత నిర్మాణం వారికి ఉన్న అన్ని వనరుల గురించి కూడా పవన్ చెబుతూ తమది ఎదుగుతున్న పార్టీ కాబట్టే టీడీపీతో కలసి అడుగులు వేయాల్సి వస్తోందని అన్నారు.
బాబుది నాలుగున్నర దశాబ్దాల అపారమైన రాజకీయ అనుభవం అని కూడా పవన్ గుర్తు చేయడం విశేషం. పవన్ చెప్పినది కనుక చూస్తే రేపటి రోజున చంద్రబాబు ప్రభుత్వంలో ఆయనను ముఖ్యమంత్రిగా చూసేందుకు పవన్ పూర్తిగా సుముఖంగా ఉన్నారు అని అంటున్నారు. అదే విధంగా రేపటి రోజున బాబు క్యాబినెట్ లో పవన్ పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అని అంటున్నారు.