Begin typing your search above and press return to search.

బాబు చుట్టూ కేసులు...చిక్కుముడులెన్నో....?

అమరావతి కేసుని రీ ఓపెన్ చేయాలని సీఐడీ కోర్టుని కోరడంతో టీడీపీకి ఇబ్బందులు తప్పేట్లు లేవు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   16 Oct 2023 8:57 AM
బాబు చుట్టూ కేసులు...చిక్కుముడులెన్నో....?
X

టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ కేసులు ఒకదాని తరువాత ఒకటి అన్నట్లుగా పేరుకుపోతున్నాయి. చిత్రమేంటి అంటే అసలు ఏ కేసులో బెయిల్ వేయాలి. ఏ కేసుని క్వాష్ చేయాలి. ఏ కేసులో ముందస్తు బెయిల్ తీసుకోవాలి. ఏ కేసులో వాదనలు వినిపించాలి అన్నది బాబు తరఫున లాయర్లకే అర్ధం కాని పరిస్థితి ఉంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే సీబీఐ ఎంతో ఓపికగా ప్రతీ కేసులోనూ వందల పేజీల డాక్యుమెంట్లను కోర్టుకు సబ్మిట్ చేస్తోంది. అన్ని కేసులలోనూ పక్కాగా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆడియో వీడియోలతో సహా కోర్టుకు అంద చేస్తోంది. ఇక బాబు కేసులు ఏసీబీ కోర్టు నుంచి హై కోర్టు, సుప్రీం కోర్టు దాకా ఉన్నాయి. అలాగే అక్టోబర్ మంత్ క్యాలెండర్ లో డేట్స్ కూడా ఈ కేసులతో నిండిపోతున్నాయి. సుప్రీం కోర్టులో బాబు క్వాష్ పిటిషన్ మీద ఈ నెల 17న విచారణ జరుగుతోంది.

అదే టైం లో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను హై కోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ పిటిషన్ ను బుధవారం విచారించనున్నట్లు ఏపీ హైకోర్టు వెల్లడించింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ కావాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ మీద కౌంటర్ చేస్తూ ఏకంగా 500 పేజీల వివరణతో సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది.

ఈ నేపధ్యంలో ఈ కేసు విచారణ వాయిదా పడింది. ఇక అంగళ్ళు కేసు, ఫైబర్ నెట్ కేసు మరో వైపు ఉన్నాయి. ఇపుడు కొత్తగా మరో కేసుగా అమరావతి ముందుకు వస్తోంది అని అంటున్నారు. అమరావతి కేసుని రీ ఓపెన్ చేయాలని సీఐడీ కోర్టుని కోరడంతో టీడీపీకి ఇబ్బందులు తప్పేట్లు లేవు అని అంటున్నారు.

అమరావతి రాజధాని పేరిట అసైన్డ్ భూములను కొనుగోలు చేశారు, అలాగే కొన్ని చోట్ల బలవంతంగా తీసుకున్నారు అంటూ అప్పట్లో సీఐడీ ఈ కేసుని టేకప్ చేసి చాలా వరకూ విచారించింది. ఇపుడు ఈ కేసులో కొత్త ఆధారాలు తమ వద్ద ఉన్నాయని సీఐడీ అంటోంది. అందువల్ల రీ ఓపెన్ చేయాలని కోర్టుకు కోరడంతో ప్రతివాదులకు కోర్టు నోటీసులు ఇచ్చింది.

సీఐడి చెబుతున్న కొత్త ఆధారాలను కనుక పరిగణనలోకి తీసుకుంటే అమరావతి కేసులో అనేక మలుపులు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ కేసులో ఆడియో వీడియో ఆధారాలను కూడా సేకరించిన సీఐడీ ప్రస్తుతానికి ఆడియో వివరాలను అందించింది. తొందరలో వీడియోలను కూడా ఇస్తామని చెబుతోంది.

దీంతో ఈ కేసును నవంబర్ 1కి వాయిదా వేసిన హై కోర్టు ప్రతివాదుల అభ్యంతరాల కోసం నోటీసులను జారీ చేయడంతో అమరావతి అసైన్డ్ భూముల కేసు మీద అందరి దృష్టి ఉంది. ఇంకో వైపు చూస్తే చంద్రబాబుకు అంగళ్ళ కేసులో ముందస్తు బెయిల్ దక్కింది. కానీ స్కిల్ స్కాం లో ముందస్తు బెయిల్ మీద విచారణ రేపు జరగనుంది. అదే టైం లో క్వాష్ పిటిషన్ మీద సుప్రీం కోర్టు ఏమి చెబుతుంది అన్నది అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ఇవన్నీ వరసబెట్టి కేసులుగా ముందుకు రావడంతో బాబుకు రిలీఫ్ దేంట్లో లభిస్తుంది అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు.