Begin typing your search above and press return to search.

ఢిల్లీ పిలుస్తోంది : ఇటు జగన్... అటు బాబు !

ధర్నా సక్సెస్ అని వైసీపీ ప్రకటించుకుంది. కొత్త పొత్తులకు తెర లేచింది. జగన్ ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చారు.

By:  Tupaki Desk   |   25 July 2024 5:11 PM GMT
ఢిల్లీ పిలుస్తోంది : ఇటు జగన్... అటు బాబు  !
X

ఏపీ రాజకీయం అంతా ఢిల్లీ చుట్టూ తిరుగుతోందా అన్న చర్చ సాగుతోంది. ఏపీ శాసనసభ సమావేశాలు కూడా పట్టించుకోకుండా వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ భారీ ధర్నా నిర్వహించారు. ఇండియా కూటమి నేతలు వచ్చి సంఘీభావం తెలిపారు. ధర్నా సక్సెస్ అని వైసీపీ ప్రకటించుకుంది. కొత్త పొత్తులకు తెర లేచింది. జగన్ ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చారు.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన శుక్రవారం ఢిల్లీకి బయల్దేరి వెళ్తున్నారు. బాబు ఈ నెల 27న జరిగే నీతి అయోగ్ సమావేశంలో పాల్గొనడానికి వెళ్తున్నారు అని అంటున్నారు. అయితే దానితో పాటుగా ఆయన కేంద్ర పెద్దలను కలుస్తారు అని అంటున్నారు.

ఏపీకి బడ్జెట్ లో పెద్ద పీట వేసి ఆదుకున్నందుకు గానూ ప్రధాని మోడీ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లను బాబు కలిసి ధాంక్స్ చెబుతారు అని అంటున్నారు. అలాగే అమిత్ షాని కూడా కలుస్తారు అని అంటున్నారు.

ఈ సందర్భంగా రాజకీయ చర్చలు కూడా జరిపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వైసీపీ అధినేత జగన్ ఇండియా కూటమితో కలసి ఆందోళన చేపట్టిన నేపధ్యంలో తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ఏపీలో మారుతున్న పరిణామాలను చంద్రబాబు కేంద్ర పెద్దలతో పంచుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఎన్డీయేకి జగన్ కి దూరం పెట్టాలని ఇప్పటిదాకా టీడీపీ కోరుతోంది అని అంటున్నారు. ఇపుడు ఆ అవసరం లేదని అంటున్నారు. దాంతో రాజ్యసభలో వైసీపీకి బలం ఉంది కాబట్టి మద్దతు అవసరం బీజేపీకి ఉన్న నేపధ్యంలో వైసీపీ వైఖరి ఎలా ఉంటుందో అన్నది కూడా బీజేపీ పెద్దలకు తెలియాల్సి ఉంది.

అయితే అలాంటి ఇబ్బంది లేకుండా వైసీపీ నుంచి ఎంపీలను టీడీపీలోకి తీసుకోవడమో లేక బీజేపీలోకి తీసుకోవడమో చేస్తారు అని అంటున్నారు. అంతే కాదు ఏపీలో లిక్కర్ స్కాం విషయంలో టీడీపీ ప్రభుత్వం ఇప్పటికే సీఐడీ విచారణకు ఆదేశించిన నేపధ్యంలో ఆ వివరాలు కూడా పంచుకోవచ్చు అని అంటున్నారు.

ఏపీలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఇండియా కూటమికి పూర్తి ప్రత్యర్థిగా ఉన్న బీజేపీ వైసీపీ పట్ల ఇపుడు ఏ రకమైన స్టాండ్ తీసుకోబోతుంది అన్నది కూడా బాబు తాజా టూర్ లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. మరో వైపు జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలు బడ్జెట్ అనంతరం మారిన నేపథ్యాన్ని కూడా చంద్రబాబు తన టూర్ లో అధ్యయనం చేస్తారు అని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ ఢిల్లీ టూర్ ముగిసిన తరువాత బాబు వెళ్లబోతున్న నేపథ్యంలో ఈ పర్యటన ఉత్కంఠను రేకెత్తిస్తోంది అనే అంటున్నారు.