Begin typing your search above and press return to search.

ఉచిత బస్సు రోడ్డెక్కేది అపుడేనా ?

అలాగని చేయాలనుకుంటే ఖజానా భారం మోయలేనంటోంది. ఇపుడు అలాంటి ఒక పధకం గురించి కూటమి సర్కార్ సమీక్ష చేస్తోంది.

By:  Tupaki Desk   |   12 Aug 2024 9:30 PM GMT
ఉచిత బస్సు రోడ్డెక్కేది అపుడేనా ?
X

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉచిత హామీల అమలు మీద మల్ల గుల్లాలు పడుతోంది. సాధ్యమైనంత వరకూ వెంటనే అమలు చేయకపోతే వైసీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. అలాగని చేయాలనుకుంటే ఖజానా భారం మోయలేనంటోంది. ఇపుడు అలాంటి ఒక పధకం గురించి కూటమి సర్కార్ సమీక్ష చేస్తోంది.

ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అన్నది పెద్ద హామీ. ఇది అమలు చేస్తే మహిళలు అంతా హ్యాపీ ఫీల్ అవుతారు. తెల్లారి లేస్తే పనులకు వెళ్లే వారు ప్రయాణం చార్జీలను భరించలేకపోతున్నాను. వారంతా కూటమి సర్కార్ కి ధన్యవాదాలు చెప్పుకుంటారు. అయితే ఉచిత బస్సు పధకం అన్నది ఆచరణలో అనుకున్నంత తేలిక అయితే కాదు.

నెలకు ఏకంగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఏటా మూడు వేల కోట్ల రూపాయలు అన్న మాట. ఆర్టీసీని తెచ్చి ప్రభుత్వంలో గత ప్రభుత్వం విలీనం చేసింది. కానీ నష్టాలు కష్టాలూ అలాగే ఉన్నాయి. ఆర్టీసీ ఈ రోజుకీ ఇబ్బందుల్లో ఉంది.

ఉచిత బస్సు ప్రయాణం అంటే అది మోయలేనిదే అవుతుంది అని అంటున్నారు ప్రభుత్వం ఆర్టీసీ నష్టాలను అలా ఉంచి ఈ పధకం దాకా అయినా నిధులను అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక గత కొన్నేళ్ళుగా ఆర్టీసీకు కొత్త బస్సులు లేవు. చాలా చోట్ల డొక్కు బస్సులే ఉన్నాయి. ఉచిత ప్రయాణం అంటే జనాల తాకిడి మామూలుగా ఉండదు, ఉన్న బస్సులు సరిపోవు, పైగా అవి కాలం తీరినవిగా ఉన్నాయని అంటున్నారు.

దాంతో కొత్త బస్సులు కొనాలని కూడా ఆర్టీసీ నుంచి ప్రతిపాధనలు వెళ్లాయని అంటున్నారు. దాంతో ముందు ఆ నిధులు సమకూర్చాల్సి ఉంది. అయితే ఏపీ అంతా ఉచిత బస్సులు పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్స్ లను పరిమితం చేయాలని భావిస్తున్నారు. అంతే కాదు విశాఖ విజయవాడ వంటి మెగా సిటీలలో సిటీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతించాలని చూస్తున్నారు.

అయితే నిధుల సమస్య కారణంగానే ఈ పధకం ఆలస్యం అవుతోంది అని అంటున్నారు. నిజానికి ఆగస్ట్ 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణానికి పచ్చ జెండా ఊపాలని అనుకున్నారు. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఏ రకమైన సంచలన నిర్ణయం తీసుకుంటుందో తెలియదు అని అంటున్నారు. తెలంగాణా కర్నాటకలలో అమలు అవుతున్న ఉచిత బస్సు పధకాన్ని కూడా అధికారులు ఈ మధ్య అధ్యయనం చేసి వచ్చారు. ఆ నివేదికను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది అని అంటున్నారు.

అంతే కాదు ఏపీకి అనుగుణంగా విధివిధానాలను ఖరారు చేస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి రైట్ రైట్ అని ఉచిత బస్సు ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే ఖజానా మాత్రం రెడ్ సిగ్నల్ చూపిస్తోంది అని అంటున్నారు.