బొచ్చు లేదు.. బ్రెయినూ లేదు.. బాలయ్య, పురందేశ్వరిపై కొడాలి ఫైర్!
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు అరెస్టుపై పలు రాజకీయ పార్టీలు, పలువురు రాజకీయ నాయకులు విభిన్నంగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 9 Sep 2023 11:26 AM GMTస్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు అరెస్టుపై పలు రాజకీయ పార్టీలు, పలువురు రాజకీయ నాయకులు విభిన్నంగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్న నేతలు ఈ రకంగా అయినా బయటకు వచ్చారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టును ఖండించిన వారి కామెంట్లపై కొడాలి నాని తనదైన శైలిలో స్పందించారు.
అవును... చంద్రబాబు అరెస్టు.. బాలకృష్ణ, పురందేశ్వరి, పవన్ కల్యణ్ మొదలైన రాజకీయ నాయకుల రియాక్షన్స్ పైనా, తాజా రాజకీయ పరిస్థితులపైనా మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని స్పందించారు. ఇందులో భాగంగా తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. బాలకృష్ణకు బొచ్చు లేదు, పురందేశ్వరికి బ్రెయినూ లేదని అన్నారు!
చంద్రబాబు అరెస్టుపై ముందూ మెల్లగా మొదలుపెట్టిన కొడాలి నాని... అనంతరం తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఏపీ ప్రభుత్వంపైనా, జగన్ పైనా విమర్శలు చేస్తున్నవారిపై మండిపడ్డారు. "చంద్రబాబు ఎఫ్ఐఆర్ లో లేనిది ఎక్కడ? అని ప్రస్నిస్తూ... ఏ అవినీతిలో చూసినా ఆయనే ఉన్నాడు" అని నిప్పులు చెరిగిన కొడాలి నాని... చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు.
ఇదే సమయంలో చంద్రబాబు గురించి ఎన్టీఆర్ అలా చెబితే... ఆయన బిడ్డలు అయిన బాలయ్య, పురందేశ్వరి మాత్రం చంద్రబాబును వెనకేసుకొస్తారని కొడాలి మండిపడ్డారు. ఈ సందర్భంగా... "బాలకృష్ణ బొచ్చు లెస్.. పురందేశ్వరి బ్రెయిన్ లెస్.." అంటూ... ఎన్టీఆర్ కడుపున పుట్టిన వీళ్లకి సిగ్గులెస్ అన్నట్లుగా కొడాలి ఫైరయ్యారు. పదవులు డబ్బుల కోసం ఎన్టీఆర్ ను మోసం చేశారని మండిపడ్డారు!
ఈ సందర్భంగా పురందేశ్వరి కంటే ఎక్కువగా బాలకృష్ణను టార్గెట్ చేసినట్లు కనిపించారు కొడాలి నాని. ఇందులో భాగంగా... బాలయ్య ఆల్రెడీ బొచ్చు లెస్ అనే విషయం అందరికీ తెలుసు, అయితే ఇప్పుడు బ్రెయిన్ లెస్ అని కూడా అనిపించుకున్నాడు అని కొడాలి ఫైరయ్యారు.
తన అల్లుడు లోకేష్ ఇచ్చిన స్క్రిప్ట్ ను చదవడమే బాలకృష్ణ పనిగా పెట్టుకున్నాడని, బాలకృష్ణ నిత్యం ఎవరిదో బొచ్చు పైన పెట్టుకొని తిరుగుతుంటాడు కాబట్టి.. కనీసం బ్రెయిన్ అయినా ఆయనది వాడితే బాగుంటుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇదే సమయంలో పవన్ కల్యాణ్ పైనా ఫైరయ్యారు కొడాలి నాని. రూ.118 కోట్ల వ్యవహారంలో ఐటీ శాఖ నోటీసులపై స్పందించని వాళ్లు.. ఇవాళ స్కిల్ స్కాంలో అరెస్ట్ కాగానే చంద్రబాబుకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారని మొదలుపెట్టారు. అనంతరం చంద్రబాబు అవినీతిలో భాగం ఉంది కాబట్టే.. దొంగలంతా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయంపై జనసేన సంపూర్ణంగా ఖండిస్తుందని చెప్పిన పవన్ వ్యాఖ్యలపై ఫైరయిన కొడాలి నాని... ప్యాకేజీ తీసుకునేవాడు అంతకన్నా ఏం మాట్లాడతాడు అని ప్రశ్నించారు. ఇదే సమయంలో చంద్రబాబు పెట్రోల్ కొట్టిస్తేనే.. పవన్ తన వారాహిని బయటకు తీస్తాడని ఎద్దేవా చేశారు!