Begin typing your search above and press return to search.

బాబు కోసం మరో సీనియర్ లాయర్... ఎస్సెల్పీ వేసిన లూథ్రా!

స్కిల్ డెవలప మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   25 Sep 2023 7:37 AM GMT
బాబు కోసం మరో సీనియర్ లాయర్... ఎస్సెల్పీ వేసిన లూథ్రా!
X

స్కిల్ డెవలప మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయనపై నమోదైన అభియోగాలు, పలు పిటిషన్ల పై వాదనలకు పలువురు సీనియర్ న్యాయవాదులు ఇప్పటికే వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీం లో క్వాష్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో మరో లాయర్ ఎంట్రీ ఇచ్చారు.

అవును... ప్రస్తుతం చంద్రబాబు సంబంధించి సుప్రీంలో క్వాష్ పిటిషన్ తోపాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్, ఫైబర్ గ్రిడ్ స్కాంలో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌, ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు, అంగల్లులో జరగిన అల్లర్లకు సంబంధించిన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లు వరుసగా విచారణకు సిద్ధంగా ఉన్నాయి!

ఈ నేపథ్యంలో చంద్రబాబు కోసం మరో సీనియర్ లాయర్ సిద్ధంగా ఉన్నారు. ఇందులో భాగంగా ప్రముఖ న్యాయవాది ప్రమోద్ దూబే ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే బాబు కోసం పనిచేస్తున్న సీనియర్ న్యాయవాదుల టీం లో తాజాగా ఈయన కూడా వచ్చి చేరారు. ఈ క్రమంలో... ఏసీబీ కోర్టులో జరిగే బెయిల్ పిటీషన్ విచారణలో చంద్రబాబు తరపు ప్రమోద్ దూబే వాదనలు వినిపించనున్నారు. ఈయనతోపాటు సిద్దార్ధ్ లూథ్రా వాదనల్లో పాల్గొంటారు.

మరోపక్క అటు సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ విచారణకు స్వీకరిస్తే.. అక్కడ చంద్రబాబు తరపున వాదనలు వినిపించేందుకు న్యాయవాదులు హరీస్ సాల్వే, సిద్దార్ధ అగర్వాల్ లు సిద్ధంగా ఉన్నారు.

ఇదే సమయంలో రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు సహకరించలేదని చెబుతున్న సీఐడీ అధికారులు... మరో మూడు రోజులు కస్టడీ కావాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా... ఈ కేసులో కీలకమయిన వ్యక్తులు దేశం విడిచి పారిపోతున్నారని, వారిలో ముఖ్యంగా శ్రీనివాస్‌, మనోజ్‌ వాసుదేవ్‌ పరారీలో ఉన్నారని చెబుతున్న సీఐడీ... వీరి వెనుక చంద్రబాబు ఉన్నారని ప్రాథమికంగా తెలుస్తోందని చెబుతుంది.

ఈ రోజు లంచ్ బ్రేక్ అనంతరం చంద్రబాబు బెయిల్ పిటీషన్లు, పిటి వారెంట్లపై విచారణ జరగనుంది. ఇదే క్రమంలో సుప్రీంకోర్టులో చంద్రబాబు లాయర్ల స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రపదేశ్‌ ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేరిన బాబు తరుపు లాయర్లు.. ఆయనకు తక్షణం ఉపశమనం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు!