Begin typing your search above and press return to search.

బెయిల్ పిటిషన్ వాయిదా... కస్టడీపై కొనసాగుతున్న టెన్షన్!

అవును... ఏపీ హైకోర్టులో బాబు దాఖలు చేసిన ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ వాయిదా పడింది.

By:  Tupaki Desk   |   21 Sep 2023 7:43 AM GMT
బెయిల్  పిటిషన్  వాయిదా... కస్టడీపై కొనసాగుతున్న టెన్షన్!
X

ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం వాయిదా వేసింది. ఇదే సమయంలో మరోపక్క కస్టడీ పిటిషన్ తీర్పుపైనా ఉత్కంఠత కొనసాగుతుంది.

అవును... ఏపీ హైకోర్టులో బాబు దాఖలు చేసిన ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ వాయిదా పడింది. ఇందులో భాగంగా విచారణను ఈనెల 26కి హైకోర్టు వాయిదా వేసింది. ఇదే సమయంలో హైబ్రిడ్ విధానంలో విచారించాలని పిటిషనర్లు కోరగా... కోర్టు అందుకు అంగీకరించింది.

మరోపక్క చంద్రబాబు కస్టడీ పిటిషన్‌ పై ఏసీబీ కోర్టులో ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కాసేపట్లో తీర్పు వెలువరించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు తీర్పు ఇస్తామని కోర్టు స్పష్టం చేసింది. కాగా... ఈ రోజు ఉదయం గం. 11:30 ని. కే తీర్పు ఇస్తామని బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే!

ఈ కేసులో ఏపీ సీఐడీ తరుఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా.. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు లూథ్రా, సిద్ధార్థ్‌ అగర్వాల్‌ లు వాదనలు వినిపించారు.