Begin typing your search above and press return to search.

ఏపీ కేబినెట్ లో పెద్దాయన - చిన్నాయన వీరే!

ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు కూటమి ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు

By:  Tupaki Desk   |   13 Jun 2024 5:10 AM GMT
ఏపీ కేబినెట్ లో పెద్దాయన - చిన్నాయన వీరే!
X

ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు కూటమి ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఇదే సమయంలో ఆయనతోపాటు 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.

ఈ సందర్భంగా కొత్తగా కొలువుదీరిన మంత్రిమండలి సరాసరి వయసు 55 ఏళ్లు కాగా... ఏ వయసు వారు ఎంతమంది ఉన్నారనే విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఏభై ఏళ్ల లోపు వారు, 50 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్నవారు, 60 నుంచి 70 ఏళ్లు పైబడినవారు, 70ఏళ్లు పైబడినవారి జాబితా తెరపైకి వచ్చింది. వీరిలో ఎక్కువమంది 50 నుంచి 60 ఏళ్ల మధ్యవారే కావడం గమనార్హం.

అవును... ఏపీ కేబినెట్ లో వయసులవారిగా మంత్రుల జాబితాను పరిశీలిస్తే... మంత్రుల్లో వయసుపరంగా చూస్తే ఎండీ ఫరూక్ (74) అందరికంటే పెద్దవారు కాగా... విజయనగరం జిల్లా గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కోండపల్లి శ్రీనివాస్ (40) పిన్న వయస్కుడిగా ఉన్నారు. ఇదే సమయంలో కొత్త మంత్రివర్గంలో 50 నుంచి 60 ఏళ్ల మధ్యవారు అత్యధికంగా 13 మంది ఉన్నారు.

వీరిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎస్ సవిత, గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు.

ఇక 50ఏళ్ల లోపువారిలో నారా లోకేష్, అనిత, వాసంశెట్టి సుభాష్, రాంప్రసాద రెడ్డి, టీజీ భారత్, కొండ్పల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఇక 60 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్నవారి విషయానికొస్తే... వీరిలో ముగ్గురు ఉన్నారు. ఇందులో భాగంగా... పి. నారాయణ, కందుల దుర్గేష్, బీసీ జనార్థన్ రెడ్డి ఉండగా.. 70 ఏళ్లు దాటినవారిలో ఫరూక్ తో పాటు ఆనం రామనారాయణరెడ్డి ఉన్నారు.