Begin typing your search above and press return to search.

అయ్యన్న గంటా మాజీ మంత్రులుగానేనా ?

అయ్యన్న తన రాజకీయ జీవితంలో పది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఏడు సార్లు గెలిచారు. ఆరుసార్లు మంత్రిగా వివిధ శాఖలు చూశారు

By:  Tupaki Desk   |   12 Jun 2024 9:32 AM GMT
అయ్యన్న గంటా మాజీ మంత్రులుగానేనా ?
X

చంద్రబాబు ముఖ్యమంత్రిగా 2014 నుంచి 2019 దాకా పాలిస్తే ఆ అయిదేళ్ళ పాటు మంత్రులుగా అధికారం చలాయించిన వారు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు. ఈ ఇద్దరు నేతలే ఉమ్మడి విశాఖలో టీడీపీ రాజకీయాలను శాసించారు. గంటా కంటే ముందు అయ్యన్న అనేక పర్యాయాలు చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా వివిధ శాఖలు చూశారు. ఆయన ఎన్టీఆర్ మంత్రివర్గంలోనూ పనిచేశారు.

అయ్యన్న తన రాజకీయ జీవితంలో పది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఏడు సార్లు గెలిచారు. ఆరుసార్లు మంత్రిగా వివిధ శాఖలు చూశారు. ఇక గంటా శ్రీనివాసరావు తన రాజకీయ జీవితంలో అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. తొలిసారిగా కాంగ్రెస్ నుంచి మంత్రిగా రెండేళ్ల పాటు పనిచేసిన గంటా టీడీపీ హయాంలో మరో అయిదేళ్ల పాటు చేశారు.

ఇలా ఏళ్ళ తరబడి మంత్రులు అయినా ఈ ఇద్దరికీ చంద్రబాబు విరామం ఇచ్చారు. ఎమ్మెల్యేలుగా వారికే టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న బాబు మంత్రి పదవుల విషయంలో మాత్రం పక్కన పెట్టారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్త్తం 15 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒకే ఒక్క మంత్రి పదవిని ఇచ్చారు. అది కూడా వంగలపూడి అనితకు ఇచ్చారు. ఆమె 2014లో రాజకీయ ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిస్తే 2024లో మరోసారి ఎమ్మెల్యే అయ్యారు.

ఇక విశాఖ జిల్లాలో మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్న వారి జాబితా చాలా పెద్దదే. ఏపీలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన పల్లా శ్రీనివాస్ తప్పకుండా మంత్రి అవుతాను అనుకున్నారు. అలాగే గవర సామాజిక వర్గానికి చెందిన కొణతాల రామకృష్ణ తకు మంత్రి పదవి తప్పకుండా వస్తుంది అని తలచారు. పెందుర్తి నుంచి జనసేన తరఫున పోటీ చేసి 81 వేల భారీ మెజారిటీతో గెలిచిన పంచకర్ల రమేష్ బాబు కూడా మంత్రి పదవి కోసం ఎదురు చూశారు.

అంతే కాదు పెందుర్తి టికెట్ కోసం చూసి చివరి నిముషంలో మాడుగులకు షిఫ్ట్ అయి భారీ మెజారిటీతో గెలిచిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కూడా మంత్రి పదవిని గట్టిగా కోరుకున్నారు. వైసీపీ నుంచి జనసేనలోకి జంప్ చేసి ఎమ్మెల్యే అయిన వంశీ క్రిష్ణ శ్రీనివాస్ తో పాటు యలమంచిలి నుంచి జనసేన తరఫున గెలిచిన సుందరపు విజయకుమార్, అలాగే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విశాఖ తూర్పు నుంచి గెలిచిన వెలగపూడి రామక్రిష్ణబాబు, విశాఖ పశ్చిమంలో హ్యాట్రిక్ కొట్టిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గణబాబు కూడా మంత్రి పదవుల కోసం ఎంతో ఆశపడ్డారు.

కానీ చంద్రబాబు మార్క్ మంత్రివర్గం కూర్పు అందరి ఆశల మీద నీళ్ళు చల్లేసింది అని చెప్పాలి. దాంతో పాటుగా అతి పెద్ద ఉమ్మడి జిల్లా విశాఖకు ఒకే ఒక మంత్రి పదవిని కేటాయించటం పట్ల కూటమి లో అసంతృప్తి కనిపిస్తోంది. విస్తరణలో చాన్స్ అనుకున్నా ఒకే ఒక్క మంత్రి పదవి ఖాళీ తప్ప లేదు. ఈ మంత్రివర్గం కనీసంగా రెండున్నరేళ్ళు పనిచేసినా ఆ రోజుకు జరిగే మార్పు చేర్పులలో రాజేవరో మంత్రెవరో అని వైరాగ్యం ప్రదర్శిస్తున్నారు. మొత్తానికి చూతే మంత్రి పదవీత్యాగం మాత్రం చాలా మందిని కుదురుగా ఉండనీయడం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి కాకపోవడం అయ్యన్నకు గంటాకు ఇదే ఫస్ట్ టైం అని అంటున్నారు. సో వారు అనుచరుల బాధ కూడా వర్ణనాతీతంగా ఉంది అంటున్నారు.