చంద్రబాబు పర్యటనకు బ్రేక్.. ఏం జరిగింది?
ఈ ఏడాది నుంచి దీనిని తీసేసి.. వేరే సంక్షేమ కార్యక్రమాల్లో కలిపేశారు. దీంతో నేతన్న నేస్తం లేదు.
By: Tupaki Desk | 7 Aug 2024 7:47 AM GMTఏపీ సీఎం చంద్రబాబు చీరాలలో పర్యటన పెట్టుకున్నారు. మధ్యాహ్నం 3.30కు చీరాలలో నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవంలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. దీంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించేందుకు సర్కారు ఏర్పాట్లు చేసింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించు కుని చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. వాస్తవానికి వైసీపీ హయాంలో చేనేత దినోత్సవం నాడు.. `నేతన్న నేస్తం` పేరుతో చేనేతలకు ఆర్థికంగా సాయం అందించేవారు.
ఈ ఏడాది నుంచి దీనిని తీసేసి.. వేరే సంక్షేమ కార్యక్రమాల్లో కలిపేశారు. దీంతో నేతన్న నేస్తం లేదు. దీని స్థానంలో నేతన్నలతో ముఖాముఖి నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. చీరాలలో దీనికి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఉండవల్లి నుంచి చంద్రబాబు బయలు దేరి వెళ్లాల్సి ఉంది. కానీ, ఇంతలో నే విజయవాడ సహా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వాతావరణం మారిపోయింది. దట్టమైన మేఘాలు కమ్ముకుని.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చంద్రబాబు తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
ఇక, విజయవాడలో నిర్వహించనున్న చేనేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికార వర్గా లు తెలిపాయి. వాస్తవానికి చీరాలలో అయితే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దీనిని చంద్రబాబు ప్రారంభిం చాల్సి ఉంది. అలాగే పెద్ద ఎత్తున బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. దీనిలోనూ చంద్రబాబు పాల్గొని ప్రసంగించాల్సి ఉంది. దీనికిగాను ప్రభుత్వం నుంచి రూ.15 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు సమాచారం. అయితే.. అననుకూల వాతావరణంతో తన కార్యక్రమాన్ని చంద్రబాబురద్దు చేశారు.
విజయవాడలోనే బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. చీరాలలో నిర్వహించ తలపెట్టిన సభను విజయవాడకు పరిమితం చేయడం ద్వారా.. నేతన్నల సమస్యలను ప్రస్తావించి.. వారికి ఊరట కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నే ఆయదృచ్ఛికంగానే అయినా.. విజయవాడలో సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సభ ద్వారా చేనేత కార్మికులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించనున్నారు.