Begin typing your search above and press return to search.

అయోధ్యలో పక్కపక్కన చంద్రబాబు చిరంజీవి...!

ఇక పవన్ కళ్యాణ్ అయితే తన జీవితంలో ఇదొక సంతోషకరమైన సందర్భం అన్నారు.

By:  Tupaki Desk   |   22 Jan 2024 9:45 AM GMT
అయోధ్యలో పక్కపక్కన చంద్రబాబు చిరంజీవి...!
X

అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి సెలబ్రిటీస్ అంతా హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వెళ్లారు. అందులో మెగాస్టార్ చిరంజీవి ఆయన కుమారుడు రాం చరణ్ ఉన్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు.

వీరంతా అయోధ్యలో కనిపించగానే మీడియా చుట్టుముట్టింది. ప్రశ్నలు కూడా వేసి వారితో మాట్లాడించింది. ఇక పవన్ కళ్యాణ్ అయితే తన జీవితంలో ఇదొక సంతోషకరమైన సందర్భం అన్నారు. వందల ఏళ్ల కల నెరవేరింది అని అన్నారు. అదే తీరున చంద్రబాబు చిరంజీవి కూడా హర్షం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే సెలబ్రిటీస్ కి అందరికీ అయోధ్య రాముల వారి గుడి ప్రాంగణంలో కుర్చీలు వేసి మర్యాదలు చేసింది అయోధ్య రామాలయం ట్రస్ట్. ఇక అయోధ్యలో కెమెరాలు అన్నీ ప్రధాని మోడీ తో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమం వైపు ఎక్కువగా తిరిగాయి.

అదే సమయంలో సమయం దొరికినపుడు వీఐపీల వైపు కూడా కెమెరాలు తిరిగాయి. ఆ సమయంలో చంద్రబాబు చిరంజీవి పక్క పక్కన కూర్చుని కెమెరాలకు చిక్కారు. ఈ ఇద్దరు నవ్వుతూనే కెమెరాలకు కనిపించారు. అంతకు ముందు చూపించినపుడు చిరంజీవి తన ఫ్యామిలీతో కనిపించారు సతీమణి సురేఖ, అలాగే కుమారుడు రాం చరణ్ లతో ఆయన కూర్చుని ఉన్నారు.

అయితే ప్రధాని మోడీ స్పీచ్ తరువాత కెమెరాలు మళ్లీ తిరిగినప్పుడు మాత్రం చంద్రబాబు చిరంజీవి పక్కన ఉండడం ఆసక్తిని రేపింది. ఈ ఇద్దరూ ఏపీలో ఇటీవల కాలంలో ఎపుడూ కలుసుకున్నట్లుగా ఏమీ కనిపించలేదు. ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి. హీట్ గా ఏపీ పాలిటిక్స్ ఉంది.

ఇక జనసేన అధినేత చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తులో ఉన్నారు. అయినా సరే చిరంజీవి ఈ పొత్తుల గురించి కానీ కూటమి గురించి కానీ ఎక్కడా మాట్లాడింది లేదు అసలు చిరంజీవి పాలిటిక్స్ గురించే మాట్లాడటం లేదు. ఈ నేపధ్యంలో చంద్రబాబు చిరంజీవి కలిసి పక్కన ఒకరికొకరు ఉండడడం మాత్రం చర్చకు దారి తీస్తోంది.

వారు ఏమి మాట్లాడుకుంటారు అన్నది కూడా ఉత్కంఠగానే ఉంటుంది. అయితే అయోధ్య వంటి పవిత్ర ప్రదేశంలో జై శ్రీరాం అంటూ ఆధ్యాత్మికపరమైన విషయాలనే మాట్లాడుకోవచ్చు అని అంతా అంటున్నారు. మరో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ అక్కడ పూర్తి భక్తి భావంతో కనిపించారు.

రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట జరుగుతున్న వేళ పవన్ ఫుల్ ఎమోషన్ అయ్యారు. ” శ్రీరాముడు మన భారత నాగరికత యొక్క వీరుడు అని ..రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తిలకించడం నాకు కన్నీళ్లు తెప్పిస్తుంది అని.. శ్రీరాముడిని తిరిగి అయోధ్యలోకి తీసుకురావడానికి ఐదు శతాబ్దాల పోరాటం పట్టింది అంటూ పవన్ కళ్యాణ్ ట్విట్ చేశారు .ఆ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతే కాదు పవన్ లోని భక్తిభావం ఆయనలోని ఎమోషన్స్ అన్నీ కూడా ఆ ట్వీట్ లో తెలిసాయని అంటున్నారు.