Begin typing your search above and press return to search.

బాబుకు మరో బ్యాడ్ న్యూస్... సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి!

దీంతో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు రెండు రోజులు తమ కస్టడీలోకి తీస్కోబోతున్నారు!

By:  Tupaki Desk   |   22 Sep 2023 9:50 AM GMT
బాబుకు మరో బ్యాడ్ న్యూస్... సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు కు ఈ రోజు వరుస షాకులు తగులుతున్నాయనే చెప్పుకోవాలి. ఇప్పటికే అత్యంత కీలకమైన క్వాష్ పిటిషన్ ను ఏపీ ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. దీంతో తీవ్ర ఉత్కంఠకు ఆ విధంగా తెరపడింది. ఈ క్రమంలో మరో బ్యాడ్ న్యూస్ తెరపైకి వచ్చింది.

అవును... తనపై నమోదు చేసిన ఎఫ్‌.ఐ.ఆర్‌, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో చంద్రబాబు రిమాండ్‌ ను మరో రెండ్రోజులు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించిన సంగతీ తెలిసిందే.

ఈ క్రమంలో చంద్రబాబును ఐదు రోజుల సీఐడీ కస్టడీకోసం దాఖలైన పిటిషన్ పైనా ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. ఇందులో భాగంగా రెండు రోజుల సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు రెండు రోజులు తమ కస్టడీలోకి తీస్కోబోతున్నారు!

ఈ సందర్భంగా ఏసీబీ కోర్టు సీఐడీకి ఒక ప్రశ్న వేసింది. ఇందులో భాగంగా... చంద్రబాబు విచారణ ఎక్కడ చేస్తారు..? అని అడిగారు ఏసీబీ కోర్టు జడ్జి! అయితే... జైల్లోనే విచారిస్తామని సీఐడీ కోర్టుకు తెలిపింది. దీంతో... జైల్లోనే చంద్రబాబుని విచారించేందుకు సీఐడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే... చంద్రబాబు విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డులు కూడా చేస్తారని తెలుస్తుంది.

ఇదే సమయంలో... విచారణ అధికారుల పేర్లు తమకు ఇవ్వాలని కోరిన న్యాయస్థానం.. లాయర్ల సమక్షంలోనే విచారణ జరగాలని ఆదేశించారు. అదేవిధంగా... ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5:00గంటల వరకు విచారణకు అనుమతించారు. ఇక, ఆదివారం సాయంత్రం కస్టడీ ముగిశాక వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు ముందు హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశిచారు.

కాగా... ఈ సీఐడీ రిమాండ్ పిటిషన్ పై చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ్‌ అగర్వాల్‌ వాదనలు వినిపించగా.. మరోవైపు ఏపీ సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించిన విషయం తెలిసిందే.