Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు 100 కోట్లు - జ‌గ‌న్ 5 వేల కోట్లు.. ఏంటీ క‌థ‌..!

సో.. దీనిని బ‌ట్టి.. అప్ప‌ట్లో చంద్ర‌బాబు 100 కోట్లు ఇస్తే.. ఇప్పుడు జ‌గ‌న్ 5 వేల కోట్లు ఇచ్చారు. కానీ, అప్పుల విష‌యంలో మాత్రం బారీ వ్య‌త్యాసం క‌నిపిస్తోంది.

By:  Tupaki Desk   |   23 Jun 2024 4:51 AM GMT
చంద్ర‌బాబు 100 కోట్లు - జ‌గ‌న్ 5 వేల కోట్లు.. ఏంటీ క‌థ‌..!
X

ప్ర‌స్తుతం మేధావుల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ ఇదే. తాజాగా సీఎం చంద్ర‌బాబు కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఖ‌జానాను ఊడ్చేశార‌ని.. ఖాజానాలో సొమ్ములు ఎంత ఉన్నాయో కూడా తెలియ‌డం లేద‌ని.. ఆయ‌న అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న స‌మ‌యంలో మీడియాతో వ్యాఖ్యానించారు. దీంతో అస‌లు ప్ర‌భుత్వాలు మారిన‌ప్పుడ‌ల్లా.. ఈ స‌మ‌స్య వ‌స్తూనే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో 2014లో చంద్ర‌బాబు తొలిసారి ఏపీకి ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌డు.. రాష్ట్ర ఖ‌జానాలో ఉన్న సొమ్ము 9 వేల కోట్లు. లోటు.. 16 వేల కోట్లు.

విభ‌జ‌న నేప‌థ్యంలో చంద్ర‌బాబుకు అందిన సొమ్ము అది. దీంతో కొంత మేర‌కు ఆయన దూకుడుగానే ముందుకు సాగారు. ఇక‌, 2019లో జ‌గ‌న్ అధికారం చేప‌ట్టే నాటికి.. చంద్ర‌బాబు దిగేపోయే స‌మ‌యానికి ఖ‌జానాలో ఉన్న సొమ్ము కేవ‌లం 100 కోట్లు మాత్ర‌మే. ఇదే విష‌యాన్ని అప్ప‌ట్లో ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు కూడా చెప్పుకొచ్చారు. ఖ‌జానాలో 100 కోట్లు మాత్ర‌మే ఉన్నాయి. జ‌గ‌న్ ఇచ్చిన హామీలను ఎలా నెర‌వేరుస్తారో తాము కూడా చూస్తాం! అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఇక‌, అప్ప‌టికి జ‌గ‌న్ ముందు ఉన్న అప్పులు.. 2.57 ల‌క్ష‌ల కోట్లు. అంటే.. జ‌గ‌న్ పాల‌న రూ.100 కోట్ల రొఖ్ఖం తో 2 ల‌క్ష‌ల కోట్ల అప్పుల‌తో ప్రారంభ‌మైంది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్‌కురెండోసారి ముఖ్య మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన చంద్ర‌బాబుకు ఖ‌జానాలో 5 వేల కోట్ల రూపాయ‌లు ఉన్నాయి. ఇదేస‌య మంలో అప్పుల రూపంలో 7 ల‌క్ష‌ల కోట్లు ఉన్న‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే 1వ తేదీన సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌ను పంపిణీ చేయాల్సి ఉన్న నేప‌థ్యంలో అధికారులు ఈ లెక్క‌లు వివ‌రించారు.

సో.. దీనిని బ‌ట్టి.. అప్ప‌ట్లో చంద్ర‌బాబు 100 కోట్లు ఇస్తే.. ఇప్పుడు జ‌గ‌న్ 5 వేల కోట్లు ఇచ్చారు. కానీ, అప్పుల విష‌యంలో మాత్రం బారీ వ్య‌త్యాసం క‌నిపిస్తోంది. దీనిని మేనేజ్ చేసుకుంటూ.. ముందుకు సాగాల్సిన అవ‌స‌రం చంద్ర‌బాబుకు ఉంటుంది. ఇక‌, ఈ ఏడాది అప్పులు చేసే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. తొలి మూడు మాసాల‌కు సంబంధించి (ఏప్రిల్‌-మే-జూన్‌) జ‌గ‌న్ ముందుగానే 25 వేల కోట్లు తెచ్చుకున్నారు. వీటిలోనే సామాజిక ప‌థ‌కాల‌కు సంబంధించి ఎన్నిక‌లు అయ్యాక పంచారు. ఇక‌, ఇప్పుడు వ‌చ్చే మూడు నెల‌ల‌కు సంబంధించిన 22 వేల కోట్ల అప్పులు చంద్ర‌బాబుకు వ‌రంగా మారాయి. మ‌రి తెచ్చుకుంటారో.. లేదో చూడాలి.