Begin typing your search above and press return to search.

విశాఖ వాసుల మీద బాబు సంచలన కామెంట్స్

విశాఖ వాసుల మనోగతం తెలుసు అన్నారు. విశాఖ వాసులు సైతం అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నారు అని చంద్రబాబు చెప్పడం విశేషం.

By:  Tupaki Desk   |   15 Aug 2023 7:27 PM GMT
విశాఖ వాసుల మీద బాబు సంచలన కామెంట్స్
X

విశాఖ వాసులు అంటే దాదాపుగా పాతిక లక్షల మంది దాకా ఉన్నారు. వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. విశాఖ అంటే కాస్మో పాలిటిన్ సిటీ. అన్ని వర్గాలు అన్ని రాష్ట్రాలు అన్ని మతాలు, ప్రాంతాలతో కూడిన సిటీ. అలాంటి విశాఖ వాసుల విషయంలో చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు.

విశాఖ వాసుల మనోగతం తెలుసు అన్నారు. విశాఖ వాసులు సైతం అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నారు అని చంద్రబాబు చెప్పడం విశేషం. విశాఖలో కూర్చుని మరీ చంద్రబాబు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక వైపు విశాఖ మీద ప్రేమ ఉందని చెబుతూనే మరో వైపు విశాఖకు రాజధాని వద్దు అంటున్నారు. అమరావతి రాజధానిగా కావాలని రావాలని విశాఖ వాసులు అనుకుంటున్నారు అన్నది బాబు మాట.

అపుడు అదే నిజమైతే అమరావతి అనే పుట్టీ పుట్టని రాజధాని మీద అక్కడి వారు ఎందుకు అంత అలుపెరగని పోరాటం చేస్తున్నారో చెప్పగలరా బాబూ అంటే ఏమని జవాబు ఇస్తారో. అంటే సిటీ అన్నదే లేని చోట రాజధాని అన్న మాట కాగితాల మీద ఉన్న చోటనే అంతటి మమకారం ఉంటే ఆల్ రెడీ రెడీ మేడ్ సిటీగా ఉన్న విశాఖ ఏపీలో ఏకైక మెట్రో సిటీగా ఉన్న విశాఖ వాసులు మాత్రం రాజధాని వద్దు అని అంటున్నారుట.

ఏ లాజిక్ కి కూడా అందని విధంగా బాబు లాంటి సీనియర్ మోస్ట్ లీడర్ వాదన ఉంది అంటే అవును అనేయొచ్చుగా. విశాఖలో నాలుగు ఎమ్మెల్యే సీట్లు తనకు ఇచ్చారు, విశాఖలో తాను పాదయాత్ర చేస్తే వేలాదిగా జనం పాలు పంచుకున్నారు అని చెబుతున్న నోటితోనే మీకెందుకు రాజధాని అని బాబు అంటున్నారు. పైగా అది విశాఖ వాసులు అంటున్నారు అని ఆయనే వారి తరఫున వకాల్తా పుచ్చుకుంటున్నారు.

ఇది ప్రజాస్వామిక దేశం, ఏ నిర్ణయం అయినా నాయకుడి భావాలు అభిప్రాయలు వేరేగా ఉండవచ్చు. ప్రజల భావన ఏమిటి అన్నది తెలియాలంటే ఒక్కటే మార్గం. అది ఓటింగ్. దానికి ఎంతో సమయం లేదు. 2024లో ఏపీలో ఎన్నికలు జరుగుతాయి. విశాఖలోనూ జనాలు ఓటేస్తారు. అపుడు టీడీపీ చంద్రబాబు విశాఖ రాజధానిగా వద్దు అమరావతి రాజధానిగా ముద్దు అంటూ ఒక బ్రహ్మాండమైన స్లోగన్ తో జనం ముందుకు వస్తే జనాలు ఓటేసి గెలిపిస్తే అపుడు ఓకే అనుకోవాలి.

ఇదే ప్రజాస్వామిక లక్షణం. ఇదే విధానం కూడా. అలా కాకుండా విశాఖవాసులు రాజధానిని కోరుకోవడం లేదు అని చెప్పడం బాబు వంటి సీనియర్ కి ధర్మమేనా అన్న చర్చ అయితే వస్తోంది. విశాఖను రాజధానిగా తాను ఎందుకు వ్యతిరేకిస్తున్నాను అన్న దానికి సవివరమైన సమాధానం బాబు చెప్పి ఉన్నా బాగానే ఉంటుంది. అలా కాకుండా విశాఖ జనం మంచి వారు అంటూ ఉబ్బిస్తూనే మీకు మాత్రం రాజధాని వద్దు అనడమేనా బాబు మార్క్ విజన్ అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

అయినా తెలివైన వారు విజన్ ఉన్న వారు రెడీ మేడ్ సిటీనే వాడుకుంటారు. ఆ మీదట గ్రోత్ ఇంజన్ సిటీగా మార్చుకుని అలా వచ్చిన ఆదాయంతో టైర్ టూ సిటీస్ ని డెవలప్ చేసుకోవడం ఒక విజన్. అపుడు ఒకటేంటి ఏపీలో ప్రతీ సిటీ రాజధాని అవుతుంది. అది కదా ఎవరైనా కోరుకునే విజన్. అలాంటివి వదిలేసి పంతాలు పట్టింపులతో ఏపీలో సాగుతున్న రాజకీయం 2047 నాటికైనా మారుతుందా. ఏపీ విజన్ని ఏ దేవుడు జాతకం చూసి చెబుతాడో మరి.