ప్రతీ మంత్రి చేతిలో ఐప్యాడ్... పేపర్ లెస్ కేబినెట్
చంద్రబాబు అంటేనే టెక్నాలజీని ఏలా వాడుకోవాలో తెలిసిన వారుగా చెబుతారు. ఆయన ఇపుడు మరో కొత్త ప్రయోగం చేయబోతున్నారు.
By: Tupaki Desk | 17 Aug 2024 3:45 AM GMTచంద్రబాబు అంటేనే టెక్నాలజీని ఏలా వాడుకోవాలో తెలిసిన వారుగా చెబుతారు. ఆయన ఇపుడు మరో కొత్త ప్రయోగం చేయబోతున్నారు. ఏపీలో పేపెర్ లెస్ కేబినెట్ మీటింగ్ కి రెడీ అవుతున్నారు. ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఈ నెల 27న ఏపీ కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ మీటింగులో పేపర్లు కనిపించవని అంటున్నారు. సాధారణంగా మంత్రివర్గ సమావేశం జరిగితే ఆ సమావేశంలో చర్చించే అజెండా ప్రకారం ప్రతి భేటీకి కనీసంగా 40 సెట్ల నోట్స్ ముద్రిస్తున్నారు. దీని వల్ల ప్రింటింగ్ ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా అవుతున్నాయని అంటున్నారు. ప్రిటింగ్ ఖర్చుకు లేకుండా చేయడంతో పాటు పేపర్ తో మీటింగు అంటే మంత్రివర్గం కీలక నిర్ణయాలు లీక్ అవుతున్నాయన్న అనుమానాలూ ఉన్నాయట.
ఇక మీదట అలాంటివి ఏవైనా జరగకుండా ఉండాలీ అంటే పేపర్ లెస్ కేబినెట్ కి రెడీ అవడమే బెటర్ అని బాబు భావిస్తున్నారు. అందుకోసమే ప్రిపేర్ చేయమని అధికారులకు ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది. అంటే ఈ నెల 27న జరిగే కేబినెట్ మీటింగులో ప్రతీ మంత్రి చేతిలో ఒక ఐప్యాడ్‌లు అందించి అజెండా నోట్స్ మొత్తం సాఫ్ట్ కాపీల రూపంలో అందజేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారుట.
ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఈ కేబినెట్ మీటింగ్ జరుగుతుందని అంటున్నారు. మంత్రులు కూడా దీనికి ప్రిపేర్ కావాలని గత కేబినెట్ లోనే చెప్పారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ నెల ఏడున కేబినెట్ భేటీ అయింది. ఇపుడు మరోసారి భేటీ అవుతోంది. అంటే ఒకే నెలలో రెండు భేటీలు అన్న మాట. ఈ భేటీ ఎందుకు అంటే కీలకమైన అంశాల మీద నిర్ణయాలు తీసుకోవడానికి అని అంటున్నారు.
ఏపీలో మద్యం పాలసీని మారుస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీని తెస్తున్నారు. దానికి సంబంధించి ఏపీ ఎక్సైజ్ అధికారులు కూడా ఇతర రాష్ట్రాల్లో పర్యటించి వచ్చారు. అక్కడ ప్రభుత్వాలు మద్యం విధానంలో అమలు చేస్తున్న పద్ధతులు అలాగే, మద్యం నాణ్యత, ధరలు, ఇతరత్రా అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు. దీనిపై నివేదికను కూడా సిద్ధం చేసి మరీ ప్రభుత్వానికి ఇటీవల అందించారు.
దాంతో కొత్త మద్యం పాలసీ మీద కేబినెట్ చర్చించి కీలక నిర్ణయం తీసుకోబోతోంది అని అంటుననరు. అంతే కాదు దసరా పండుగ వస్తోంది. ఆ సమయానికి సూపర్ సిక్స్ లోని కొన్ని హామీలను అయినా నెరవేర్చాలని ప్రభుత్వం చూస్తోంది. తక్షణమే ప్రభుత్వానికి భారీ ఎత్తున భారం కాకుండా ఉండేలా చూసుకుంటే అలాంటి పధకలౌ ఒకటి రెండు విజయ దశమి వేళ నుంచి అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అంటున్నారు. అందులో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఒకటి అని తెలుస్తోంది.
గతంలో దీపం పధకం కింద ఉచిత గ్యాస్ ని కేంద్రం ఇచ్చేది. ఉమ్మడి ఏపీ సీఎం గా బాబు ఉన్నపుడు ఈ పధకం కింద ఎక్కువ మంది లబ్దిదారులకు కేంద్రం ద్వారా సాయం అందించే ప్రయత్నం చేశారు. ఇపుడు ఉజ్వల పధకం గా ఉంది. దాంతో కేంద్రం సాయంతో ఉచిత గ్యాస్ సిలిండర్ల పధకాన్ని కొనసాగించవచ్చు అని యోచిస్తున్నారుట. ఎటూ కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి కేంద్రంలో టీడీపీ ఉంది కాబట్టి ఇది జరిగే పనే అని అంటున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కూడా దసరా నుంచి ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అని కూడా ఆలోచిస్తున్నారుట. వీటి మీద ఒక నిర్ణయం అయితే కేబినెట్ తీసుకోనుంది అని అంటున్నారు.