లాంగ్ గ్యాప్ తరువాత జగన్ మీద చంద్రబాబు డైరెక్ట్ ఎటాక్..
అంతే జగన్ మీద ఒక రేంజిలో చంద్రబాబు విమర్శల దాడిని మొదలెట్టేశారు
By: Tupaki Desk | 5 Dec 2023 5:42 PM GMTవంద రోజులకు పైగా సుదీర్ఘ విరామం తరువాత మొదటిసారి జగన్ మీద టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలతో విరుచుకుపడ్డారు. దానికి ఏపీని అతలాకుతలం చేసిన తుపాను ఒక ఆయుధంగా దొరికింది. అంతే జగన్ మీద ఒక రేంజిలో చంద్రబాబు విమర్శల దాడిని మొదలెట్టేశారు
మిచౌంగ్ తుపాను ఆంధ్రాను అన్నివిధాలుగా నష్టం చేస్తూంటే జగన్ కి ఏమీ పట్టడంలేదని బాబు దుయ్యబెట్టారు. తాను సీఎం గా ఉన్నపుడు ప్రత్యేక జీవోలను రిలీజ్ చేసి మరీ బాధితులను ఆదుకున్నాను అని ఆయన చెబుతూ జగన్ సర్కార్ని కార్నర్ చేసారు.
వచ్చి మీదపడిన తుపాను వల్ల లక్షాలాదిగా నిరాశ్రయులు అయ్యారని అన్నపానాలు లేక అంతా అలమటిస్తూంటే జగన్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. బాధితులకు భోజనాలు పెట్టడంలో సైతం మీనమేషాలు లెక్కిస్తోంది అని ఆయన విమర్శించారు
కనీసం తుపాను బాధితులలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదని బాబు అన్నారు. అనుకోని తుపానుకు పంట నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తుపాను మీద ముందస్తు హెచ్చరికలు వచ్చినా ప్రభుత్వం ఏమీ చేయలేదంటే ఏమనుకోవాలని బాబు ప్రశ్నించారు.
ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఆయన అన్నారు. అంతే కాదు వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం చేశారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో ఎటు చూసినా దుస్థితి నెలకొందని ఆయన అంటున్నారు. ప్రజలు కష్టాలలో ఉంటే ప్రభుత్వం పైసా పైసా లెక్కలేసుకోకూడ్దు అని హితబోధ కూడా చేశారు.
ఇక ప్రభుత్వంతో సంబంధం లేకుండా టీడీపీ క్యాడర్ అంతా జనంలోకి వెళ్ళి సాయం చేయాలని బాబు పిలుపు ఇచ్చారు మొత్తానికి చూస్తే అరెస్ట్ అయి జైలులో ఉండి వచ్చిన తరువాత బెయిల్ వచ్చిన నేపధ్యంలో బాబు ప్రభుత్వం మీద జగన్ మీద ఇప్పటిదాకా ఒక్క విమర్శ కూడా చేయలేదు. కానీ ఫస్ట్ టైం తుపాను బాధితులను ఆదుకోలేదంటూ చాలా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఎన్నికల ముందు వచ్చిన తుపాను చాలా ఇంపాక్ట్ కలుగచేసింది. ఎంతో నష్టం జరిగింది. బహుశా ఇదే విపక్షాలకు టీడీపీకి రాజకీయ ఆయుధంగా మారుతుందేమో చూడాలి.