Begin typing your search above and press return to search.

మరోసారి జనాల్లోకి చంద్రబాబు... ముహూర్తం ఫిక్స్!

ఇలా తనకు తానుగా వీలైనంత మేర ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసుకుంటారు చంద్రబాబు.

By:  Tupaki Desk   |   28 July 2024 11:20 AM
మరోసారి జనాల్లోకి చంద్రబాబు... ముహూర్తం ఫిక్స్!
X

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న పలు లోపభూయిష్ట నిర్ణయాల్లో ప్రజలతో మమేకమవ్వకపోవడం ఒకటనేది ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సైతం బలంగా చెప్పే మాట. ఏదో ఆర్గనైజ్ చేసినట్లుగా కొంతమందిని సెలక్టివ్ గా కలవడం కాకుండా.. నేరుగా ఆయన జనాల్లోకి వచ్చింది లేదు. దీంతో.. ఆయనకు పరదాల ముఖ్యమంత్రి అనే ట్యాగ్ లైన్ తగిలించాయి విపక్షాలు.

అయితే... టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం తాను నాలుగో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికే జనాల్లో తిరగడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా కూటమి ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఒకటైన "పెన్షన్ రూ.4000 పెంపు" లో భాగంగా జూలై 1వ తేదీన నేరుగా ఆయనే జనాల్లోకి వెళ్లి వృద్దులకు పెన్షన్ పంపిణీ చేశారు.

ఇలా తనకు తానుగా వీలైనంత మేర ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసుకుంటారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో మరోసారి ఆయన జనాల్లోకి వెళ్లనున్నారు. ఇందులో భాగంగా... వచ్చే నెల 1వ తేదీన పెన్షన్ కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని వృద్దులకు డబ్బులు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో... ఆగస్టు 1వ తేదీన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈసారి మడకశిర నియోజకవర్గం గుండుమల గ్రామంలో బాబు పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారునికి రూ.4000 పెన్షన్ నగదు పంపిణీ చేయబోతున్నారు. ఈ సమయంలో ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యేలు నేతలతోపాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత కూడా ఉండనున్నారని అంటున్నారు.

కాగా జూలై 1వ తేదీన మంగళగిరిలో జరిగిన పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు స్వయంగా పాల్గొని సామాన్యులకు డబ్బులు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 1వ తేదీన కూడా ఆయన మరోసారి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు!