Begin typing your search above and press return to search.

బాబు కంటికి క్యాటరాక్ట్ సర్జరీ సక్సెస్... డాక్టర్స్ తో ఫోటో వైరల్!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు కంటి ఆపరేషన్ అవసరమైన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   7 Nov 2023 4:58 PM GMT
బాబు కంటికి క్యాటరాక్ట్ సర్జరీ సక్సెస్... డాక్టర్స్ తో ఫోటో వైరల్!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు కంటి ఆపరేషన్ అవసరమైన సంగతి తెలిసిందే. దీంతో బాబు ఆపరేషన్ విషయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ సమయంలో స్కిల్ స్కాం కేసులో షరతులతో కూడిన మద్యంతర బెయిల్ ను మంజూరు చేసింది! తిరిగి నవంబర్ 28 సాయంత్రం 5 గంటలలోపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోమని సూచించింది!

దీంతో బెయిల్ పై బయటకు వచ్చిన చంద్రబాబు ఇవాళ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారు. అవును... టీడీపీ అధినేత చంద్రబాబుకు హైదరాబాద్‌ లోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి వైద్యులు.. క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ ను పూర్తిచేశారు. ఇప్పటికే రెండు సార్లు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబు వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

ఇందులో భాగంగా... నాలుగు రోజుల క్రితం ఏఐజీకి వెళ్లిన చంద్రబాబు ఒకరోజు అక్కడే ఉండి పలు వైద్యపరీక్షలు చేయించుకొని ఇంటికి వెళ్లారు. అనంతరం తాజాగా సోమవారం మరోసారి ఏఐజీకి వెళ్లిన ఆయనకు వైద్యులు వివిధ వైద్యపరీక్షలు చేశారు. ఇదే సమయంలో వాటితోపాటు చర్మ సంబంధిత వ్యాదులకు కూడా చికిత్స తీసుకున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో ఇవాళ ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రిలో క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ సక్సెస్ ఫుల్ గా జరిగింది.

ఇలా తన కుడి కంటికి జరిగిన కాంటరాక్ట్ ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా పూర్తవడంతో.. ఆపరేషన్ చేసిన వైద్య సిబ్బందితో చంద్రబాబు ఫోటో దిగారు. ఈ ఫోటోను టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. అయితే... చంద్రబాబు వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలుస్తుంది.

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అప్ డేట్:

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో... తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది ఉన్నత న్యాయస్థానం.

ఈ సమయంలో... స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు ఆరోగ్య సమస్యలతో మధ్యంతర బెయిల్‌ పై ఉన్నందున ఆ గడువు పూర్తయ్యే వరకు ఆయన్ను అరెస్ట్‌ చేయబోమని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు.

స్కిల్‌ స్కాం కేసులో జడ్జిమెంట్‌ డే!:

స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కాం కేసులో నవంబర్ 8న కీలక పరిణామం చోటుచేసుకోనుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా త్రివేదిల ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చెపడుతున్న సంగతి తెలిసిందే.