మెగా డీఎస్సీపై బాబు తొలి సంతకం... పోస్టుల వివరాలివే!
ఈ సందర్భంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు ఐదు ఫైల్స్ పై సంతకం చేశారు. ఇందులో భాగంగా మొదటి సంతకాన్ని 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఫైల్ పై చేశారు చంద్రబాబు.
By: Tupaki Desk | 13 Jun 2024 1:48 PM GMTఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు... గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రం 4:41 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్ లోని తన ఛాంబర్ లో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు ఐదు ఫైల్స్ పై సంతకం చేశారు. ఇందులో భాగంగా మొదటి సంతకాన్ని 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఫైల్ పై చేశారు చంద్రబాబు. అనంతరం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్ పై రెండో సంతకం చేశారు. అనంతరం సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంచే దస్త్రంపై మూడో సంతకం చేశారు.
అనంతరం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై నాలుగు, ఐదు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరభ్ కుమార్ ప్రసాద్ తో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.
కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు!:
సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) - 6,371
స్కూల్ అసిస్టెంట్స్ (ఎస్.ఏ) - 7,725
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) - 132
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) - 1781
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) - 286
ప్రిన్సిపల్స్ - 52