Begin typing your search above and press return to search.

కాబోయే మంత్రుల లిస్ట్ ఇచ్చేసిన బాబు !

మూడు పార్టీలు కలసి ప్రభుత్వంలో ఉండడం మరో విశేషం.

By:  Tupaki Desk   |   11 Jun 2024 4:08 PM GMT
కాబోయే మంత్రుల లిస్ట్ ఇచ్చేసిన బాబు !
X

ఏపీకి 12 నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఈసారి ప్రభుత్వం లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఎన్డీయే కూటమి పేరుతో ఫస్ట్ టైం ఏపీలో సర్కార్ ఏర్పాటు అవుతోంది. మూడు పార్టీలు కలసి ప్రభుత్వంలో ఉండడం మరో విశేషం.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు కాకుండా పాతిక మంది దాకా మంత్రులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ నుంచి ఇరవై మంది దాకా మంత్రులు ఉంటారని అంటున్నారు. జనసేన నుంచి నలుగురు బీజేపీ నుంచి ఒకరు ఉండొచ్చు అని అంటున్నారు. ఈ విధంగా మంత్రివర్గాన్ని కూర్పు చేశారు అని అంటున్నారు.

ఇంతకీ కాబోయే మంత్రులు ఎవరు అంటే లిస్ట్ ఎపుడో రెడీ అయిపోయింది. గవర్నర్ ని కలిసిన తరువాత చంద్రబాబు మంత్రుల జాబితాను ఆయనకు ఇచ్చారని అంటున్నారు. దాని ప్రకారం బుధవారం గవర్నర్ అబ్దుల్ నజీర్ కొత్త ప్రభుత్వం చేత ప్రమాణం చేయిస్తారు.

ఇదిలా ఉంటే కొత్త ప్రభుత్వంలో మంత్రులు ఎవరు అన్నది నరాలు తెంపేసే టెన్షన్ గా ఉంది. చాలా పేర్లు అనుకుంటున్నారు. చాలా మంది ఆశావహులు ఉంటున్నారు. ఈసారి 164 మంది ఎన్డీయే కూటమి నుంచి గెలిచారు. మంత్రి పదవులు ఉన్నవి పాతిక మాత్రమే. అంటే ప్రతీ ఏడుగురు ఎమ్మెల్యేలలో ఒకరు మంత్రి అవుతారు అన్న మాట. ఇది టఫ్ టెస్టింగ్ గానే చూడాలి.

ఏడుగురూ పోటీ పడుతున్న వేళ ఆరుగురికి నిరాశ తప్పదు. అది టీడీపీలోనే కాదు జనసేనలోనూ బీజేపీలోనూ ఉంటుంది. అయితే ఆయా పార్టీల అధినేతలు తమ వారికి నచ్చచెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఈసారి మంత్రివర్గంలో ఎవరు ఉంటారు అన్నది ఇప్పటికి బయటపడకపోయినా సగానికి సగం మంది కొత్త ముఖాలు ఉంటాయని తెలుస్తోంది. ఆలాగే యంగ్ స్టర్స్ కి ప్రయారిటీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది.

ఈసారి మంత్రిమండలి పూర్తిగా ఫ్రెష్ లుక్ తో ఉంటుంది అని అంటున్నారు. అనేక సార్లు మంత్రి పదవులు చేపట్టిన వారిని కాస్తా పక్కన పెట్టి సమర్ధులైన కొత్త వారికి పెద్ద పీట వేస్తున్నట్లుగా చెబుతున్నారు.అలా చూస్తే సగం మంది సీనియర్లు సగం మంది కొత్త వారు అన్నట్లుగా ఉండే చాన్స్ ఉంది.

ఇక మంత్రివర్గంలో ఏకైక ఉప ముఖ్యమంత్రి పదవి ఉంటుంది అది పవన్ కళ్యాణ్ కే ఇస్తున్నారు. పవన్ కి కీలక శాఖలు కూడా ఇస్తారని అంటున్నారు. ఆ తరువాత నారా లోకేష్ కి కూడా అతి ముఖ్యమైన శాఖలు లభిస్తాయని అంటున్నారు ఈ ముగ్గురూ కేంద్ర బిందువుగా ఉంటారు. వీరు కాకుండా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఎవరు ప్రమాణం చేయబోతున్నారో.