ఎన్నాళ్ల కెన్నాళ్లకీ.... చంద్ర'వదనం'!!
ఈ ఏడాది ఘనంగా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఉగాది సంబరాల్లోనూ ముఖంలో కళలేదు.
By: Tupaki Desk | 18 Jun 2024 11:30 AM GMTపై ఫొటో చూశారుగా! దీనికి పెద్దగా వివరణ అక్కర లేదు. జాకీలు పెట్టి మోయాల్సిన అవసరం కూడా లేదు. పున్నమినాటి చందమామ నిండుగా మురిసినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు మురిసిపోతున్నారు. మనసారా హ్యాపీగా ఉన్నారు. నిజానికి గత ఐదేళ్లలో ఎప్పుడూ.. చంద్రబాబును ఇలా ఎవరూ చూసి ఉండరు. ఎందుకంటే.. ప్రతి రోజూ టెన్షన్.. ప్రతి క్షణమూ టెన్షనే. పార్టీ పరంగా.. ప్రతిపక్షం పరంగా.. ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న దరిమిలా.. అనుక్షణం టెన్షన్‌తోనే ఐదేళ్లు కాలం గడిపారు.
ఈ ఏడాది ఘనంగా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఉగాది సంబరాల్లోనూ ముఖంలో కళలేదు. పెదవు లపై చిరునవ్వు కూడా కనిపించలేదు. ఏమో ఏమవుతుందో? ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో.. అనే బెంగ ఆయనను వెంబడించింది. ఇక, తాజా ఎన్నికల్లో ఘన విజయం సొంతంచేసుకున్నాక కూడా.. ఆయనలో ఈ తరహా ఆనందం కనిపించలేదు. ఎందుకంటే.. మంత్రి పదవుల పంపకం.. పార్టీలో ఎక్కడ చిచ్చు పెడుతుందో.. సీనియర్లు ఎక్కడ అలుగుతారో.. అని బెంగటిల్లారు.
కానీ, అంతా సజావుగా సాగిపోయింది. మిత్రపక్షాల సహకారం, సీనియర్ల తోడ్పాటుతో చంద్రబాబు కూటమి సర్కారు నిర్విఘ్నంగా ముందుకు సాగుతోంది. దీంతో చంద్రబాబు వదనంలో చంద్రకాంతులు వెల్లివిరు స్తున్నాయి. సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన ఆయన ఆసాంతం పరిశీలించారు. సమస్యలు తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ వయసులో ఆయన ఈ రాళ్లు రప్పల్లో నడుస్తారా? అని భావించిన మీడియా మిత్రులకు, అధికారులకు కూడా షాక్ ఇస్తూ.. అదే రాళ్లపై ఎవరి సాయం లేకుండా.. దూసుకుపోయారు.
అనంతరం నిర్వహించిన మీడియా మీటింగ్‌లో ఇలా మురిసిపోతూ కనిపించారు. పోలవరం ప్రాజెక్టును సంతోషంగా భుజాన వేసుకునేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. నిజానికి గత ఐదేళ్ల కాలంలో పోలవరం మందగించింది. పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది. అయనా కూడా సవాలును స్వాగతిచే మనస్తత్వం ఉన్న చంద్రబాబు ఎలాంటి సంకోచం లేకుండా.. పోలవరం బాధ్యతను తలకెత్తుకున్నారు.
ఇదే విషయాన్ని మీడియా మిత్రులు ప్రశ్నించినప్పుడు.. ఈ తరహా ఆనందం.. సంతోషంతో ఆయన పోలవరం పూర్తి చేస్తానంటూ.. చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లలో చంద్రబాబును చూసిన వారికి.. ఇప్పుడు పోలవరం పర్యటనలో ఆయనను చూసిన తర్వాత.. బాబులో ఆత్మవిశ్వాసం.. ఆనందం కొట్టొచ్చినట్టు కనబడిసంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చంద్రవదనం ఇలానే ఉండాలని కోరుకుంటున్నారు.