వాడుకుని వదిలేశారన్న అపవాదు ఎందుకు బాబూ..!
రేపు వైసీపీ ఏదైనా పార్టీతో కలిసి ముందుకు వెళ్లాలని అనుకుంటే ఆ పార్టీకి కూడా ఇబ్బందులు తప్పవు.
By: Tupaki Desk | 16 March 2024 12:30 PM GMTప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న రాజకీయాలు, టికెట్ల కేటాయింపు వంటివి రాజకీయంగా కాక రేపుతున్నా యి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవి విషమ పరీక్షే పెడుతున్నాయని చెప్పాలి. ఎందుకం టే.. జనసేన-బీజేపీతో కలిసి ముందుకు సాగుతున్న పార్టీ.. అందరికీ టికెట్లు ఇవ్వలేక పోతోంది. ఇది ఏ పార్టీకైనా కూడా సహజమే. రేపు వైసీపీ ఏదైనా పార్టీతో కలిసి ముందుకు వెళ్లాలని అనుకుంటే ఆ పార్టీకి కూడా ఇబ్బందులు తప్పవు. అయితే.. ఈ విషయంలో ఇతర పార్టీలకు చంద్రబాబుకు వేరే వ్యూహం ఉంది.
ఇప్పటి వరకు కష్టపడిన వారిని బుజ్జగించే లక్షణం చంద్రబాబుకు ఉంది. ఇతర పార్టీలకు అది లేదు. ఉదాహరణకు బీజేపీనే తీసుకుంటే.. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావుకు ఈ దఫా టికెట్ ఇవ్వలేదు. కనీసం ఆయనను పిలిచి మాట్లాడింది కూడా లేదు. కానీ.. టీడీపీ లో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఓపికగా నాయకులతో మాట్లాడి, వారిని బుజ్జగించి.. తిరిగి పనిచేసుకునే విధానంవైపు టీడీపీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఇప్పటి వరకు 40 మంది వరకు నాయకులను చంద్రబాబు పిలిచి మరీ బుజ్జగించారు. బాగా నే ఉంది. కానీ, ఇదేసమయంలో ఎస్సీ నాయకులుగా ఉన్న జవహర్ సహా.. ఒకరిద్దరికి కనీసం అప్పాయిం ట్మెంటు కూడా ఇవ్వలేదన్న ఆవేదన, ఆందోళన కనిపిస్తున్నాయి. మరి వీరిని కూడా పిలిచి మాట్లాడి.. బుజ్జగిస్తే.. సరిపోతుంది కదా! అనేది టాక్. వాస్తవానికి గత ఐదేళ్లలో జవహర్ పార్టీకిఅనుకూలంగా పనిచేశా రు. ఏ కార్యక్రమం అన్నా వాలిపోయేవారు.
ఏ టాస్క్ ఇచ్చినా.. తనవంతుగా న్యాయం చేశారు. ఇలాంటి నాయకుడికి పొత్తుల్లో భాగంగా సీటు పోతే.. దానిని వివరించి చెబితే బెటర్. కానీ, అలా చేయలేదు. అయితే.. అంతర్గతంగా చూస్తే జవహర్.. పార్టీని శాసించే స్థాయిలోనో.. లేక ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఆర్థిక బలంతో తన్నుకొచ్చే నాయకుడో కాకపోవ చ్చు. కానీ, వాడుకుని వదిలేశారు.. అనే టాక్.. కనుక ఎస్సీలలో ప్రచారం జరిగితే.. అదిఅంతిమంగా వ్యక్తి నష్టం కన్నా.. వ్యవస్థ నష్టం దిశగా పార్టీని నడిపించే ప్రమాదం ఉంది. ఈ విషయంలో చంద్రబాబు ఎందుకు ఉదాసీనంగా ఉన్నారో.. తెలియాల్సి ఉంది.