పోలవరం పూర్తికి రేవంత్ సహకారం ఎంత...?
అంతేకాదు.. దీనిపై అప్పటి బీఆర్ ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది.
By: Tupaki Desk | 20 Jun 2024 1:30 PM GMTరాష్ట్ర ప్రజల జీవనాడిగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు.. పొరుగు రాష్ట్రాల సహకారం కూడా ఎంతో అవసరం. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టును కొనసాగిస్తే.. తమ రాష్ట్రంలోని భద్రాచలం తదితర ప్రాంతాలు మునిగిపోతాయని.. వందలాది ఎకరాల్లో సాగుకు గండి పడుతుందని తెలంగాణ ప్రభుత్వం గతంలో పేర్కొంది. అంతేకాదు.. దీనిపై అప్పటి బీఆర్ ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది.
ప్రస్తుతం ఈ పిటిషన్ విచారణ దశలో పెండింగులో ఉంది. ఇక పోలవరాన్ని వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేయాలని చంద్రబాబు సంకల్పించిన నేపథ్యంలో తెలంగాణలోని రేవంత్ సర్కారు ఏమేరకు దీనికి సహకరిస్తుందనేది ప్రశ్న. ఇక్కడ రేవంత్‌కు రెండు రకాల సమస్యలు వున్నాయి. ఒకటి.. పోలవరం ప్రాజెక్టును దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు కాబట్టి.. దీనిని కొనసాగిస్తే.. ఆయనకు కాంగ్రెస్‌లో బలమైన ముద్ర పడుతుంది.
సో.. దీనిని కొనసాగించేందుకు ఈ అవసరం తోడ్పతుంది. కానీ, ఇదే సమయంలో తెలంగాణ ప్రజల ఆకాం క్షల మేరకు.. చూస్తే.. పోలవరాన్ని గత కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకించింది. దీంతో దీనిని కొనసాగిస్తే.. తెలంగాణ ప్రజల హక్కలను రేవంత్ ఏపీకి తాకట్టు పెడుతున్నారన్న వ్యతిరేకత పెరుగుతుంది. ఇది రాజకీయంగా ఇబ్బంది పెట్టే అంశం. దీంతో ఈ రెండు సమస్యలను అధిగమించేందుకు ఆయన ఎలాంటి వ్యూహం వేస్తారో చూడాలి. అసలు.. పోలవరం గురించి.. ఏపీ ప్రభుత్వం తెలంగాణను కోరినప్పుడు ఈ సమస్యలు తెరమీదికి వస్తాయి.
అయితే.. చంద్రబాబు.. ఇప్పటికిప్పుడు తెలంగాణను అప్రోచ్ కాకుండా కేవలం ప్యాచ్ వర్క్ పనులను పూర్తి చేయాలని భావిస్తున్నారు. దీంతో పోలవరం పనులు అయితే.. ప్రారంభమవుతాయి. గైడ్ బండ్ సహా అప్రోచ్ పనులను పూర్తి చేయడం ద్వారా తమ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రాధాన్య అంశంగా తీసుకుందనే భావనను ఆయన ప్రజల్లోకి తీసుకువెళ్తారు. అనంతరమే తెలంగాణను సంప్రదించే అవకాశంఉంది. అయితే.. ఇలా చేయడం సరికాదు. ఎందుకంటే.. మరో రెండేళ్లు ఆగితే.. తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటుంది. సో.. ఇప్పటికిప్పుడు దీనిపై చర్చిస్తే మేలు జరిగే అవకాశం ఉంటుందని పరిశీలకులు లెక్కలు వేస్తున్నారు.