చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల... బీపీ పరిస్థితి ఇది!
ఇందులో భాగంగా... బ్లడ్ ప్రెజర్, రెస్పిరేటరీ రేట్, హార్ట్ బీట్, ఫిజికల్ యాక్టివిటీ, టెంపరేచర్ మొదలైన వివరాలు వెల్లడించారు.
By: Tupaki Desk | 23 Oct 2023 5:11 PM GMTస్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు సుమారు 43 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబుకు ఆహారం, మెడిసిన్స్ ఇంటినుంచి అందుతున్నాయి. ఈ సమయంలో గత కొన్ని రోజులుగా చంద్రబాబుకు అస్వస్థతగా ఉంది! ఇందులో భాగంగా ఆయనకు చర్మ సమస్యలు ఇబ్బందిపెడుతున్నాయని అంటున్నారు.
ఈ నేపథ్యంలో వైద్యుల సూచనల మేరకు, కోర్టు ఆదేశాలతో చంద్రబాబుకు జైల్లో టవర్ ఏసీ ఏర్పాటు చేశారు అధికారులు. ఈ సమయంలో ప్రతీ రోజూ రాత్రి ఆ రోజుకు సంబంధించి చంద్రబాబు హెల్త్ బులిటెన్ ను అధికారులు విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం కూడా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబందించిన వివరాలను అధికార్లు వెల్లడించారు.
అవును... సోమవారం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాలను అధికారులు విడుదల చేశారు. ఇందులో భాగంగా... బ్లడ్ ప్రెజర్, రెస్పిరేటరీ రేట్, హార్ట్ బీట్, ఫిజికల్ యాక్టివిటీ, టెంపరేచర్ మొదలైన వివరాలు వెల్లడించారు. వీటిలో ఫిజికల్ యాక్టివిటీ గుడ్ కాగా.. బాడీ టెంపరేచర్ నార్మల్ గా ఉందని తెలిపారు
హెల్త్ బులిటెన్ లో వెల్లడించిన వివరాలు:
బ్లడ్ ప్రెజర్ (బీపీ) - 120 / 70
టెంపరేచర్ - సాధారణం
పల్స్ - 62 / మినిట్
రెస్పిరేటరీ రేట్ - 12 / మినిట్
గుండే - ఎస్ 1+, ఎస్ 2+
ఫిజికల్ యాక్టివిటీ - గుడ్
ఎస్పీఓ2 - 97% ఆన్ రూం ఎయిర్
లంగ్స్ - క్లియర్
ఈ మేరకు ఈరోజు 23-10-2023 నాడు జైలు వైద్య అధికారులు, రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రి వైద్య అధికారుల బృందం.. రిమాండ్ ముద్దాయి నెం:7691, నారా చంద్రబాబు నాయుడు, తండ్రి - ఖర్జూరనాయుడువారికి కేంద్ర కారాగారము, రాజమహేంద్ర వరం నందు పరీక్షించి ఈ కార్యలయానికి నివేదిక ఈ విధంగా అధికారులు సమర్పించారు.