Begin typing your search above and press return to search.

ఏపీ పవర్ కావాలి.. హైదరాబాద్ లోనే ఉండాల్నా బాబు?

తమలోని లోపాల్ని ఎత్తి చూపే రాజకీయ ప్రత్యర్థులు కూడా తమకు మేలు చేసే వారన్న విషయాన్ని మర్చిపోకూడదు

By:  Tupaki Desk   |   2 Jun 2024 4:33 AM GMT
ఏపీ పవర్ కావాలి.. హైదరాబాద్ లోనే ఉండాల్నా బాబు?
X

తమలోని లోపాల్ని ఎత్తి చూపే రాజకీయ ప్రత్యర్థులు కూడా తమకు మేలు చేసే వారన్న విషయాన్ని మర్చిపోకూడదు. తమ తీరుపై విమర్శల్నిసంధించే వారు చెప్పే విషయాన్ని సీరియస్ గా పరిగణించి.. తమ తప్పుల్ని దిద్దుకోవటం ద్వారా ఎదుటోళ్లకు అవకాశం ఇవ్వని తీరు కొందరు అధినేతల్లో కనిపిస్తుంది. కానీ.. ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం అందుకు భిన్నం. ఆయన చాలా మొండివారు. ఏపీ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణస్వీకారం చేయాలని తపించే ఆయన.. హైదరాబాద్ మీద ఉన్న ప్రేమను మాత్రం తగ్గించుకోవటానికి అస్సలు ఇష్టపడరు.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు.. విభజన తర్వాత హైదరాబాద్ లో ఉండటం చాలామంది రాజకీయ నేతలకు అనివార్యమన్న సంగతి తెలిసిందే. అయితే..దీనిపై విమర్శలు వెల్లువెత్తినప్పుడు ఆ తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం విడిపోయిన పదేళ్లు అయినప్పటికి.. నేటికి చంద్రబాబు పర్మినెంట్ అడ్రస్ గా హైదరాబాద్ ఉండటం ఒకపెద్ద లోపంగా చెప్పాలి. ఇప్పటికి ఏపీలో ఆయన నివాసం తాత్కాలికమన్న సంగతి తెలిసిందే.

ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చి చాలానే రోజులైంది. ఓట్ల లెక్కింపునకు మూడు రోజుల ముందు (శనివారం) కూడా చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉండటం దేనికి నిదర్శనం? తాను మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లుగా తనను కలిసిన మద్దతుదారులతో ఘంటాపథంగా చెప్పే చంద్రబాబు.. తానీ సమయంలో ఏపీలోనే ఉండాలి కదా? తనకు మద్దతు పలికే లక్షలాది మందికి మోరల్ సపోర్టుగా నిలవాలన్న భావన చంద్రబాబులో లేకపోవటం దేనికి నిదర్శనం?

విదేశీ పర్యటనను ముగించుకొని వచ్చిన ముఖ్యమంత్రి జగన్.. నేరుగా తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లిపోతే.. చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా హైదరాబాద్ లోనే ఉండిపోవటం దేనికి నిదర్శం. ముఖ్యమంత్రిగా ఏపీ పగ్గాలు కావాలి కానీ.. పర్మినెంట్ నివాసం మాత్రం ఏపీ వద్దా? అన్నది ప్రశ్న. ఈ విషయంలో తన తాజా తీరుతో వేలెత్తి చూపేలా చంద్రబాబు ఛాన్సు ఇచ్చారని చెప్పక తప్పదు. ఈ తీరు ఎప్పటికి మారేను?