జైలులో బాబుకు ఏమైంది....?
దాంతో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు వైద్యులు జైలులోకి వెళ్లారని తెలుసోంది.
By: Tupaki Desk | 12 Oct 2023 3:57 PM GMTచంద్రబాబు గత ముప్పయి మూడు రోజులుగా రాజమండ్రి కేంద్ర కార్యాలంలో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాం లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే నాటి నుంచి కేవలం క్వాష్ పిటిషన్ మీదనే బాబు తరఫున న్యాయవాదులు వివిధ కోర్టులలో పోరాడుతున్నారు. దాంతో బాబు కారాగారవాసం అలా పొడిగించబడుతోంది.
మొత్తం సీఐడీ రిమాండ్ రిపోర్ట్ నే సవాల్ చేస్తూ కొట్టివేయించుకోవాలన్న పట్టుదలతో క్వాష్ పిటిషన్ మీద పట్టుబడుతున్నారని తెలుస్తోంది. అయితే టెక్నికల్ గ్రౌండ్ లో వాదనలు అంటే అవి ఏంతమేరకు సక్సెస్ అవుతాయో తెలియదు. దాంతో చంద్రబాబు జైలు గోడల మధ్యన మగ్గిపోవాల్సి వస్తోంది.
ఇదిలా ఉంటే ఏపీలో అత్యంత వేడిమి గలిగిన ప్రాంతాలలో రాజమండ్రి ఒకటి. ఈ ఏడాది వేసవి మొత్తం గా ఉన్నట్లుగా ఉంది. దాంతో సెప్టెంబర్ అక్టోబర్ నెలలలో సైతం ఉష్ణోగ్రతలు గట్టిగానే ఉన్నాయి. ఈ నేపధ్యంలో చంద్రబాబు జైలులో విపరీతమైన ఉక్కబోత తో డీ హైడ్రేషన్ కి గురి అవుతున్నారని వార్తలు వచ్చాయి.
దాని మీద కోస్తాంధ్రా జైళ్ల డీఐజీ కిరణ్ అయితే అలాంటిది ఏమీ లేదని బాబు ఆరోగ్యం బాగానే ఉందని చెప్పుకొచ్చారు. ఇపుడు చూస్తే సడెన్ గా బాబు అలెర్జీతో కూడా బాధపడుతున్నారు అని అంటున్నారు. ఉక్కబోత వల్లనే బాబు ఈ విధంగా అలెర్జీతో బాధపడుతున్నారని అంటున్నారు.
దీని మీద సమాచారం అందుకున్న జైళ్ళ అధికారులు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలకు సమాచారం అందించారు. దాంతో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు వైద్యులు జైలులోకి వెళ్లారని తెలుసోంది. మరి బాబు డీ హైడ్రేషన్ కి గురి అయితే ఆయనకు జైలులోనే వైద్యం అందిస్తారా లేక ఆసుపత్రికి తరలిస్తారా అన్నది చూడాలి. ఏడున్నర పదుల వయసులో బాబు ఉన్నారు.
దాంతో ఆయనకు ఉన్న ఆరోగ్య సమస్యల మీద కుటుంబ సభ్యులు తరచూ ప్రస్తావిస్తున్నారు. అయితే బాబుకు ఇపుడు అలెర్జీ వచ్చిందన్న వార్తతో వైద్యులు అప్రమత్తం అయ్యారు. మరో వైపు చూస్తే దాదాపుగా నలభై రోజుల తరువాత బాబు ఈ నెల 16న బయట ప్రపంచంలోకి రాబోతున్నారు ఆయన రాజండ్రీ నుంచి విజయవాడ కోర్టుకు ఫైబర్ నెట్ కేసులో విచారణకు రానున్నారు. ఈ కేసులో వాదనలు తరువాత కోర్టు ఏమి తీర్పు ఇస్తుంది అన్నది కూడా చూడాల్సి ఉంది.