చంద్రబాబు ఆ హాస్పటల్ లో అడ్మిట్ అయ్యారా?
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది.. ఆ తర్వత మోడీ నామినేషన్ సందర్భంగా వారణాసిలో కనిపించిన చంద్రబాబు
By: Tupaki Desk | 28 May 2024 6:11 AM GMTఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది.. ఆ తర్వత మోడీ నామినేషన్ సందర్భంగా వారణాసిలో కనిపించిన చంద్రబాబు.. అనంతరం కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లారని వార్తలు వచ్చాయి. పైగా ఆయనకంటే వారం ముందే నారా లోకేష్ దంపతులు అమెరికా వెళ్లారని కథనాలొచ్చాయి. అయితే... అప్పటి నుంచి ఇప్పటివరకూ చంద్రబాబుకు విదేశీయాత్రకు సంబంధించిన ఒక్క అప్ డేట్ కూడా అధికారికంగా రాకపోవడం గమనార్హం.
అవును... చంద్రబాబు వైద్యపరీక్షల కోసం సతీమణి సమేతంగా అమెరికా వెళ్లారని.. ఒక వారం రోజులు ఉండి వస్తారని.. మీడియాలో కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే... చంద్రబాబు హైదరాబాద్ లో బయలుదేరినప్పటి నుంచి.. ఇప్పటివరకూ ఆయనకు సంబందించిన ఒక్క అప్ డేట్ కూడా అధికారికంగా అగుపించలేదు! ఈ సమయంలో రకరకాల గాసిప్పులు తెరపైకి వచ్చాయి.
ఇందులో భాగంగా... చంద్రబాబుకు సింగపూర్ లో వ్యాపారాలు ఉన్నాయని, ఈ సమయంలో ఆయన అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో గాసిప్స్ తెరపైకి వచ్చాయి. మరోపక్క అమెరికాకు వెళ్లి అక్కడ నుంచి ఇటలీకి వెళ్లారని.. ఈ మేరకు ఇటలీలోని కుమో ప్రాంతంలో కారులో కనిపించారని మరో విషయం సోమవారం నుంచి నెట్టింట హల్ చల్ చేసింది!
దీంతో... అసలు చంద్రబాబు అమెరికాలో ఉన్నారా.. సింగపూర్ వెళ్లారా.. ఇటలీలోనే ఉన్నారా.. ఇండియాకు ఈ నెలలోనే వస్తారా.. ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఎలా ఉంది.. మొదలైన ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తున్నాయి. ఈ సమయంలో చంద్రబాబు అమెరికాలోనే ఉన్నారంటూ హాస్పటల్ పేరుతో సహా ఒక వార్త ఎన్నారై వర్గాల నుంచి తాజాగా తెరపైకి వచ్చింది.
చంద్రబాబు ప్రస్తుతం అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలో ఉన్నారని.. అక్కడ ఉన్న మాయో క్లీనిక్ లో అడ్మిట్ అయ్యారని.. టోటల్ బాడీ చెకప్ చేయించుకుంటున్నారని.. ఎన్నారై వర్గాల నుంచి సమాచారం అందుతుంది. మాయో క్లీనిక్ నెంబర్ వన్ గా ఉందని.. అక్కడున్న ఒక డాక్టర్ తో చంద్రబాబుకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని.. అందువల్ల ఆయన వద్దే అన్ని రకాల బాడీ చెకప్ లూ చేఇంచుకుంటున్నారని అంటున్నారు!
ప్రధానంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో సుమారు 53 రోజులు జైల్లో ఉండటం.. అనంతరం కంటి ఆపరేషన్.. వెంటనే అవిశ్రాంతంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో బాబు బాగా అలసిపోయారని అంటున్నారు. ఈ సమయంలో అన్ని రకాలుగానూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుని.. ఫుల్ ఫిట్ నెస్ తో తిరిగి ఏపీకి రాబోతున్నారని చెబుతున్నారు.
అంతవరకూ బాగానే ఉంది కానీ... అమెరికా వెళ్లినట్లు చెబుతున్న చంద్రబాబు ఇప్పటివరకూ తనకు సంబంధించిన ఏ చిన్న అప్ డేట్ కూడా ఇవ్వకపోవడం పైనే పలు సందేహాలు తెరపైకి వస్తున్నాయి! ఏది ఏమైనా... అన్నీ అనుకూలంగా జరిగితే ఆయన మరో రెండు మూడు రోజుల్లో చంద్రబాబు తిరిగి ఏపీకి వస్తారని మాత్రం అంటున్నారు!