Begin typing your search above and press return to search.

చంద్రబాబు కేబినెట్లో సీనియర్లకు నో చాన్స్?

దీంతో, చంద్రబాబు క్యాబినెట్ లో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి అన్న విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   6 Jun 2024 9:32 AM GMT
చంద్రబాబు కేబినెట్లో సీనియర్లకు నో చాన్స్?
X

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి చరిత్రాత్మక విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. టీడీపీ పోటీ చేసిన 144 స్థానాల్లో 135 స్థానాలను కైవసం చేసుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. జనసేన 21 స్థానాలు, బీజేపీ 8 స్థానాలతో కలుపుకుంటే మొత్తం టీడీపీ కూటమి 164 స్థానాలతో రికార్డు స్థాయిలో విజయ దుందుభి మోగించింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 12న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో, చంద్రబాబు క్యాబినెట్ లో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి అన్న విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే టీడీపీలోని సీనియర్ నేతలు మొదలు జూనియర్ నేతల వరకు అందరూ మంత్రి పదవి రేసులో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. కేబినెట్ బెర్త్ కోసం ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ లతో పలువురు నేతలు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆల్రెడీ మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పించాలి అన్న విషయంపై చంద్రబాబు క్లారిటీగా ఉన్నారని, రఫ్ గా ఓ లిస్ట్ కూడా ప్రిపేర్ అయిందని టాక్ వస్తుంది. సీనియర్లకు చెక్ పెట్టి కొత్తవారికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పార్టీలోకి కొత్త రక్తాన్ని ఎక్కించాలని, లోకేష్ నేతృత్వంలో పనిచేసేలా మెజారిటీ సంఖ్యలో యువకులతో కూడిన మంత్రివర్గాన్ని చంద్రబాబు ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది. విజన్ 2047 నినాదంతో ముందుకు పోతున్న చంద్రబాబు మరో రెండు దశాబ్దాల పాటు టిడిపిని గెలుపు బాటలో నడిపించే మంత్రివర్గ కూర్పు కోసం చూస్తున్నారని తెలుస్తోంది. ఈ ఊహాగానాలు నిజమైతే ఉత్తరాంధ్రలోనే మూడు ఉమ్మడి జిల్లాల్లో టీడీపీకి చెందిన సీనియర్ నేతలకు మంత్రివర్గంలో అవకాశం దక్కడం కష్టమని తెలుస్తుంది.

ఉత్తరాంధ్ర నుంచి జనసేన కూడా నాలుగు స్థానాలను గెలుచుకున్న నేపథ్యంలో వారికి కూడా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. బొబ్బిలి నుంచి గెలిచిన బేబీ నాయనకు క్యాబినెట్లో బెర్త్ దక్కే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ఇక, శ్రీకాకుళం నుంచి గౌతు శిరీషకు, ఆముదాలవలస నుంచి కూన రవికుమార్ కు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని టాక్ వస్తోంది. పాయకరావుపేట నుంచి వంగలపూడి అనిత, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు వంటి కొత్త ముఖాలకు చంద్రబాబు క్యాబినెట్ లో చోటు దక్కబోతుందని తెలుస్తోంది.