Begin typing your search above and press return to search.

కేటీఆర్ కి ఇపుడు చంద్రబాబు ఆదర్శమంట !

ఎందుకంటే బీఆర్ఎస్ ని మింగేసి ఆ ప్లేస్ లోకి రావాలని చూస్తోంది ఎవరో కాదు బీజేపీ. పైగా ఇపుడు ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణాలో పార్టీని విస్తరిస్తారు.

By:  Tupaki Desk   |   21 Jun 2024 5:30 PM GMT
కేటీఆర్ కి ఇపుడు చంద్రబాబు ఆదర్శమంట !
X

అంతా కాల మహిమ. టైం బాగుంటే నాలిక తోచినట్లుగా మాట్లాడుతుంది. అదే టైం రివర్స్ కొడితే నాలిక మడతేసి మరీ కొత్త ముచ్చట్లు చెబుతుంది. ఇది ఎక్కువగా రాజకీయ నేతల విషయంలో చూడవచ్చు. అధికారంలో ఉంటే అంతా మాదే అనుకుంటారు. కానీ అదే అధికారం తల్లకిందులు అయితే వాస్తవం లోకి వస్తారు అని అంటారు.

మ్యాటర్ లోకి వచ్చేస్తే 2019 ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా డౌన్ ఫాల్ అయింది. టీడీపీకి కేవలం 23 సీట్లే దక్కాయి. సొంత రాష్ట్రంతో పాటు పొరుగున ప్రత్యర్ధి ప్రభుత్వాలే వచ్చాయి. ఢిల్లీలో ఇక చెప్పాల్సింది లేదు. కేంద్ర ప్రభుత్వంతో వైరం అప్పటికి పచ్చిగా ఉంది. మోడీ రెండోసారి రెట్టించిన మెజారిటీతో నెగ్గి దూకుడు మీద ఉన్నారు.

ఒక విధంగా చెప్పాలంటే ఏడు పదుల వయసులో అది చంద్రబాబుకు అగ్ని పరీక్షగా మారింది. ఇక టీడీపీలో నేతలు బయటకు రాక పనిచేసే వారు లేక ఉన్న వారు అంతా ఇంట్లో కూర్చుని పూర్తిగా సంక్షోభంలోకి వెళ్ళిపోయింది.

దాంతో చంద్రబాబు తన అనుభవాన్ని అంతా రంగరించారు. యూత్ ని ముందుకు నడిపించారు. పార్టీలో వారికి ప్రయారిటీ ఇచ్చారు. దాంతో పాటు ఆయన వేసిన ఎత్తులకు జగన్ చేసిన తప్పులు కూడా కారణం అయి మళ్లీ ల్యాండ్ స్లైడ్ విక్టరీని అందుకున్నారు. ఇక దీని వెనక ఉన్న అతి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ అని వేరేగా చెప్పాల్సింది లేదు.

ఇపుడు తెలంగాణాలో చూస్తే దాదాపుగా ఇదే పరిస్థితి బీఆర్ఎస్ కి ఉంది. ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతున్నారు. అదే సమయంలో క్యాడర్ యాక్టివ్ గా లేదు. ఈ నేపధ్యంలో బీఆర్ఎస్ నేతలకు చంద్రబాబు ఆదర్శంగా కనిపిస్తున్నారుట. 2019లో చంద్రబాబు దారుణ ఓటమి నుంచి మళ్లీ పడి లేచిన కెరటంగా దూసుకుని వచ్చారు కదా అని పార్టీ వారికి నూరిపోస్తున్నారుట.

అంతే కాదు ఓపికగా ఉంటే ఎపుడు చాన్స్ వస్తే అపుడు తీసుకుని అధికార పార్టీని దెబ్బ కొడతామని చెబుతున్నారుట. కానీ టీడీపీకి చంద్రబాబుకు బీజేపీ రూపంలో కొండంత అండ లభించింది. మరి బీఆర్ఎస్ కి ఆ పట్టు రావాలి కదా అని అంటున్నారు.

ఎందుకంటే బీఆర్ఎస్ ని మింగేసి ఆ ప్లేస్ లోకి రావాలని చూస్తోంది ఎవరో కాదు బీజేపీ. పైగా ఇపుడు ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణాలో పార్టీని విస్తరిస్తారు. అలా పవన్ చంద్రబాబు మోడీ కలిస్తే తెలంగాణాలో బీజేపీ మరింతగా స్ట్రాంగ్ అవడం ఖాయమని అంటున్నారు. దాంతో పొలిటికల్ ఫైట్ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుంది కదా అని అంటున్నారు.

బీఆర్ఎస్ పరిస్థితి ఇంతకు ఇంత దిగజారడమే కానీ గ్రాఫ్ పెరిగేది ఎలా అన్న చర్చ సాగుతోంది. మొత్తానికి ఎమోషన్ లో పుట్టిన బీఆర్ఎస్ ఇపుడు ఏ ఏమోషన్ లేని వేళ అధికారం ఆవిరి అయిన వేళ పట్టు కోసం చూస్తోంది. బాబుని చూస్తూ తామూ అలాగే బలపడతామని అనుకుంటోంది. కానీ ఏడారిలో గులాబీ పూవులు పొస్తాయా అన్నది ప్రత్యర్ధులు వేస్తున్న సెటైర్లు.