Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్... రెండు కోర్టుల్లోనూ చంద్రబాబుకు దక్కని ఊరట!

అవును... ఏపీ హైకోర్టు, విజయవాడ ఏసీబీ కోర్టుల్లో చంద్రబాబుకు దాఖలు చేసుకున్న రెండు కీలక పిటిషన్లపై విచారణ ముందుకు సాగలేదు.

By:  Tupaki Desk   |   17 Oct 2023 8:24 AM GMT
బిగ్  బ్రేకింగ్... రెండు కోర్టుల్లోనూ చంద్రబాబుకు దక్కని  ఊరట!
X

స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయన తరుపు న్యాయవాదులు ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టులలో బాబుపై ఉన్న కేసులలో క్వాష్, బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్ లపై తమ వాదనలు వినిపిస్తున్నారు! ఈ నేపథ్యంలో ఇవాళ కూడా అటు హైకోర్టు, ఇటు ఏసీబీ కోర్టుల్లో చంద్రబాబుకు ఊరట దక్కలేదు.

అవును... ఏపీ హైకోర్టు, విజయవాడ ఏసీబీ కోర్టుల్లో చంద్రబాబుకు దాఖలు చేసుకున్న రెండు కీలక పిటిషన్లపై విచారణ ముందుకు సాగలేదు. దీంతో ఆయన ఈ నెల 19 వరకూ వేచి చూడాల్సిన పరిస్దితి! మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై మధ్యాహ్నం విచారణ జరగబోతోంది. 17ఏ కేంద్రంగా జరుగుతున్న ఆ విచారణలో చంద్రబాబు తరుపు న్యాయవాది ఇప్పటికే తన వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించాల్సి ఉంది!

వివరాళ్లోకి వెళ్తే... ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ ఇప్పటికే వాయిదా పడుతూ వస్తోన్న నేపథ్యంలో... తాజాగా ఇవాళ విచారణ ప్రారంభమైంది. దీంతో... ఇరువర్గాల లాయర్లు తమ తమ వాదనలు వినిపించారు.

ఈ తరుణంలో... ఈ పిటిషన్ పై విచారణను హైకోర్టు ధర్మాసనం ఈ నెల 19కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ నేపథ్యంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని అంటున్నారు.

ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ సంగతి అలా ఉంటే... మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్లు ఆయన హెల్త్ అప్ డేట్స్ ఇవ్వాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేసారు. చంద్రబాబుకు ఈ నెల 14న రాజమండ్రి జీజీహెచ్ వైద్యులు చేసిన ఆరోగ్య పరీక్షలకు సంబంధించి పూర్తి రిపోర్ట్ ని ఇవ్వాలని బాబు కుటుంబ సభ్యులు కోరిన సంగతి తెలిసిందే. దీనిపై... జైలు అధికారులు, కోర్టు అనుమతి తీసుకోమని చూచించారు.

ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టులో బాబు తరుపు న్యాయవాదులు అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టులో ఈరోజు వాదనలు ప్రారంభమయ్యాయి. అయితే దీనిపై సీఐడీ కౌంటర్ దాఖలు చేయాలని సూచిస్తూ విచారణను వాయిదా వేసింది. దీంతో చంద్రబాబు హెల్త్ అప్ డేట్స్ విషయంలోనూ ఆయనకు ఊరట దక్కలేదనే అనుకోవాలి.

మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్‌ నెట్‌ స్కాం కేసుపై విచారణ ఈ రోజు మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఇందులో భాగంగా... స్కిల్‌ డెవలప్ మెంట్ స్కాం కేసు, ఏపీ ఫైబర్‌ నెట్‌ స్కాం కేసులకు సంబంధించిన విచారణలు ఒకేసారి చేస్తామని జస్టిస్‌ అనిరుధ్‌ బోస్‌ తెలిపారు.