Begin typing your search above and press return to search.

బాబు మాస్ వార్నింగ్...వారికి గుండె దడ ఖాయమా ?

విశాఖ రాజధాని అని చెప్పి దందాలు చేసిన వారి భరతం పడతామని అన్నారు.

By:  Tupaki Desk   |   11 July 2024 4:03 PM GMT
బాబు మాస్ వార్నింగ్...వారికి గుండె దడ ఖాయమా ?
X

ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు. విశాఖ పర్యటనలో ఆయన ఒక పవర్ ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. విశాఖను నిలువునా దోచేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు అని స్పష్టం చేశారు. విశాఖ రాజధాని అని చెప్పి దందాలు చేసిన వారి భరతం పడతామని అన్నారు.

దీంతో దందా రాయుళ్ల గుండెలలో రైళ్ళు పరిగెడుతున్నాయి. విశాఖలో వందల ఎకరాలను స్వపక్షీయులు అంతా వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలను పక్కన పెట్టి మరీ రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటూ తీసుకున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు విశాఖ నుంచి మొదలుపెడితే శ్రీకాకుళం దాకా ఎటు చూసినా దందాలే ఉన్నాయని ఆనాడు విపక్షంలోని టీడీపీ జనసేన ఆరోపిస్తూ వచ్చాయి.

ఇవి ఏకంగా వేల ఎకరాల దాకా ఉందని కూడా స్పష్టం చేశాయి. ఇపుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాంతో ఈ మొత్తం ఆరోపణల మీద సమగ్రమైన విచారణ జరిపిస్తామని కూటమి నాయకులు అంటున్నారు. ఇపుడు ప్రభుత్వ సారధి హోదాలో తొలిసారిగా విశాఖ పర్యటనకు వచ్చిన చంద్రబాబు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆర్ధిక నేరగాళ్ళు అన్నారు. విశాఖలో దందాలు చేసిన వారిని టీడీపీ కూటమి ప్రభుత్వం వదలదు అంటున్నారు.

దాంతో చాలా మంది దందారాయుళ్ళ గుండెలలో రైళ్ళు పరిగెడుతున్నాయని అంటున్నారు. విశాఖను రాజధాని అని చెప్పి చాలా చోట్ల భూములను కారు చౌకగా తీసుకున్నారు అని అంటున్నారు. ఇందులో ప్రభుత్వ ప్రైవేట్ అసైన్డ్ భూములు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయని అంటున్నారు. ఆ వివరాల చిట్టాను బయటకు తీసే పనిలో కూటమి పెద్దలు సీరియస్ గా వర్క్ చేస్తున్నారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే విశాఖ రాను రానూ విస్తరిస్తోంది. విశాఖ ఏపీకి అతి ముఖ్యమైన నగరంగా ఉంది. అభివృద్ధి చేయాలంటే భూములు చాలా అవసరం. అలాంటి చోట ప్రభుత్వ భూములు అన్నీ కబ్జాకు గురి అయితే అభివృద్ధి కుంటుపడుతుందని అంటున్నారు. దాంతో ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకుని వాటిలో అభివృద్ధి పనుకలు అవసరమైన సంస్థలకు కేటాయింపులు చేయాలని కోరుతున్నారు.

ఏదిఏమైనా విశాఖ అభివృద్ధితో ముడిపడిన భూముల వ్యవహారం కానీ కబ్జాలు కానీ ఒక కొలిక్కి రావల్సి ఉంది. విభజన తరువాత నుంచి విశాఖలో భూ దందాలు ఎక్కువ అయినట్లుగా కూడా వార్తలు ఉన్నాయి. ప్రైవేట్ స్థలాలను ఆఖరుకు స్వాతంత్ర సమరయోధుల స్థలాలను కూడా ఎక్కడా వదలకుండా కబ్జా చేసిన ఘనులు చాలా మంది ఉన్నారు. దాంతో కచ్చితంగా వీటి మీద కూటమి ప్రభుత్వం భారీ యాక్షన్ దిశగా అడుగులు వేస్తుందని అంటున్నారు. గజం లక్ష రూపాయలకు పైగా ఉన్న భూములకు అప్పనంగా కొట్టేశాయలని చూసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని అంటున్నారు.