Begin typing your search above and press return to search.

పవన్ కోసం మోడీకి స్పెషల్ లెటర్ రాసిన చంద్రబాబు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం ఏపీ ముఖ్యమంత్రి కం టీడీపీ అధినేత చంద్రబాబు దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు

By:  Tupaki Desk   |   21 Jun 2024 4:10 AM GMT
పవన్ కోసం మోడీకి స్పెషల్ లెటర్ రాసిన చంద్రబాబు
X

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం ఏపీ ముఖ్యమంత్రి కం టీడీపీ అధినేత చంద్రబాబు దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దశాబ్దాలుగా ఆయన్నుచూస్తున్న వారు సైతం విస్మయానికి గురయ్యేలా పవన్ విషయంలో ఆయన తీరు ఉందంటున్నారు. మిత్రపక్షాలతో జట్టు కట్టటం చంద్రబాబుకు కొత్తేం కాదు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎందరితోనో జట్టు కట్టినప్పటికీ పవన్ తో ఆయన అనుబంధం మాత్రం ప్రత్యేకంగా చెబుతున్నారు. ఆ మాటకు వస్తే లోకేశ్ ను ఎలా అయితే మనసుకు తీసుకుంటారో.. పవన్ విషయంలోనూ అంతేనని చెబుతారు.

అనధికారికంగా అందిన సమాచారం ప్రకారం ఎన్నికల్లో చారిత్రక విజయం తర్వాత పవన్ ను కలిసిన సందర్భంలో మంత్రి వర్గం గురించి ఇరువురు మాట్లాడుకున్న వేళలో.. ఎన్ని మంత్రి పదవులు కావాలంటే అన్ని తీసుకోండంటూ బ్లాంక్ చెక్ మాదిరి.. చంద్రబాబు ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు చెబుతారు. దీనికి పవన్ సైతం అంతే ఒద్దికగా రియాక్టు కావటం.. పద్దతి ప్రకారమే వెళదాం.. ప్రత్యేకంగా పదవులు వద్దన్న విషయాన్ని క్లియర్ గా చెప్పినట్లు తెలుస్తోంది.

అంతేకాదు.. ఏమేం శాఖలు కావాలన్న విషయంలోనూ పవన్ కు చంద్రబాబు ఓపెన్ ఆఫర్ ఇవ్వగా.. రోటీన్ కు భిన్నంగా మిగిలిన నేతల తీరుకు విరుద్దంగా పవన్ కోరుకున్న శాఖలు అంత పెద్ద బాబును సైతం ఆశ్చర్యానికి గురి చేసినట్లుగా చెబుతారు. పవన్ కోరుకున్న శాఖలకు అదనంగా రెండు.. మూడు శాఖలు తాను ఇస్తానని చెప్పటమే కాదు.. ‘మీరు కోరుకున్న శాఖలతో మీరు పెద్దగా చేయలేరు. వాటికి అదనంగా మరిన్ని శాఖలు ఇస్తా. మీరు చేయాలనుకున్న మార్పు వీలవుతుంది’ అన్న మాట చెప్పినట్లుగా సమాచారం. అందుకు తగ్గట్లే.. పవన్ కోరుకున్నట్లుగా ప్రచారం జరిగిన శాఖలకు అదనంగా మరోరెండు శాఖలు అదనంగా ఉండటం కనిపిస్తుంది.

అధికారం కోసం అర్రులు జాచటం.. మిత్రపక్షంగా పెద్ద కోరికలు కోరటం.. ఇబ్బందికర అబ్లిగేషన్లను తీసుకొచ్చే తీరుకు భిన్నంగా పవన్ తీరు ఉండటం.. ఆయన ఫోకస్ మొత్తం ఏపీ ప్రజల బతుకులు మారాలన్న దానిపైనే ఉండటం చంద్రబాబు సైతం పవన్ మీద గౌరవాన్ని అంతకంతకూ పెంచేలా చేస్తుందని చెబుతున్నారు. అందుకే.. పవన్ కోరుకున్న దాని కోసం ఏమైనా సరే అన్నట్లుగా బాబు వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. తాజాగా తనకు ఓఎస్ డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా కేరళలో పని చేస్తున్న ఏపీకి చెందిన యువ ఐఏఎస్ అధికారి మైలవరపు వీఆర్ క్రిష్ణతేజను డిప్యుటేషన్ కింద తీసుకొచ్చే ప్రయత్నానికి తెర తీశారు చంద్రబాబు.

పవన్ కోరిక మీద ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక లేఖ రాశారు. కేరళలో ఉన్న ఆయన్ను ఏపీకి డిప్యుటేషన్ మీద తీసుకురావాలన్న విన్నపాన్ని కేంద్రానికి పంపారు. సాధారణంగా ఉప ముఖ్యమంత్రికి ఓఎస్ డీగా ఆర్డీవో స్థాయి అధికారిని కేటాయిస్తారు. కానీ.. పవన్ మాత్రం తనకు ఓఎస్ డీగా క్రిష్ణతేజను ఏరికోరి ఎంచుకున్నారు. యువ ఐఏఎస్ కావటం.. తనకెప్పటినుంచో పరిచయం ఉండటంతో తన మైండ్ సెట్ ఏమిటన్న విషయాన్ని పవన్ చెప్పాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు.. తప్పుడు నిర్ణయాలు తీసుకోవటానికి ఏ మాత్రం అవకాశం ఉండదు.

దీనికి తోడు ఐఏఎస్ అధికారి క్రిష్ణతేజ.. వ్యక్తిగతం, వృత్తి పరంగా కానీ ఎలాంటి మచ్చ లేని నిజాయితీ అధికారిగా పేరుంది. కేరళ ప్రభుత్వానికి టాస్కు మాస్టర్ గా ఆయన పలు సందర్భాల్లో వ్యవహరించారు. నిండైన మానవత్వంతో పాటు.. తాను ఏ పదవిలో ఉన్నా దానికి నూటికి నూరుపాళ్లు న్యాయం చేయటంతో పాటు.. క్లిష్ట సమయాల్లో ఎలా వ్యవహరించాలి.. సమస్యల్ని ఎలా అధిగమించాలన్న అంశంలోనూ ఆయనకున్న నేర్పు ఇప్పటికే పలుమార్లు ఫ్రూవ్ అయ్ంయింది.

సమర్థ అధికారి అన్న ఇమేజ్ ఉన్న క్రిష్ణతేజను తన టీంలో చేర్చుకోవటంతో ద్వారా పాలనాపరమైన అంశాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవటానికి వీలవుతుందని పవన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. క్లీన్ చిట్ అధికారి అన్న ఇమేజ్ ఒక ఎత్తు అయితే.. తనకు బాగా తెలిసిన క్రిష్ణతేజతో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని పవన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. పాలనలో తనకు అవసరమైన సలహాల్ని.. సూచనల్ని అందించటంతో పాటు తనను వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకుండా తన చుట్టూ ఉండే వ్యవస్థను కంట్రోల్ చేసే సత్తా క్రిష్ణతేజకు ఉండటం తనకు లాభిస్తుందన్నది పవన్ ఆలోచనగా చెప్పాలి.

రాజకీయ అవగాహన ఉన్నప్పటికి పాలనాపరమైన అంశాల్లో తనకు అవగాహన పెద్దగా లేని నేపథ్యంలో.. ఆ విషయంలో మరింత పట్టు కోసం తన సన్నిహితుడే తనకు ఓఎస్డీగా ఉండటమే మంచిదన్నది పవన్ ఆలోచన. దీనికి తోడు.. ఎలాంటి విమర్శలకు అవకాశం ఇవ్వని తీరు క్రిష్ణతేజ సొంతం. ఈ వ్యవహార శైలి పవన్ ఇమేజ్ ను మరింత పెంచటంతో పాటు.. ఏపీ గ్రామీణ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చాలన్న పవన్ ఆశయానికి ఇది తోడ్పాటు అందిస్తుందని చెబుతున్నారు. ఈ కారణంతోనే మరో చర్చకు అవకాశం ఇవ్వని చంద్రబాబు పవన్ కోసం.. వెంటనే ప్రధానికి స్పెషల్ లెటర్ రాశారు. కేంద్రం నుంచి ప్రత్యేక అనుమతి వచ్చిన తర్వాత క్రిష్ణతేజ కేరళ నుంచి ఏపీకి వస్తారు. ఇందుకు ఎక్కువ టైం పట్టదన్న మాట వినిపిస్తోంది.