Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఏ-37 కాదు, ఏ-1... సెక్షన్ ల లిస్ట్ ఎంతుందంటే?

అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసింది సీఐడీ.

By:  Tupaki Desk   |   9 Sep 2023 5:44 AM GMT
చంద్రబాబు ఏ-37 కాదు, ఏ-1... సెక్షన్  ల లిస్ట్  ఎంతుందంటే?
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో భాగంగా తాజాగా నంద్యాల పట్టణంలోని ఆర్‌కె ఫంక్షన్‌ హాల్‌ లో తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో అరెస్ట్ అయిన రెండు గంటల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఏ1 గా అభివర్ణిస్తూ మీడియాకు విడుదల చేసింది.

అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసింది సీఐడీ. ఇప్పటికే ఈ కుంభకోణం పై ఈడీ కూడా విచారణ జరుపుతుండగా... పలువురు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. గతంలో ఈ కేసులో ఏ37గా ఉన్నారని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అత్యంత కీలకంగా ప్రధమ నిందితుడిగా చేర్చబడ్డారు. ఈ సమయంలో ఆయనపై పలు సెక్షన్ ల కింద కేసులు పెట్టారు.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏపీలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ రూ.3300 కోట్లకు సీమెన్స్ సంస్థ డిజైన్‌ టెక్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందంలో నాటి ప్రభుత్వం 10శాతం నిధులు, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం జ‌రిగింది. అయితే ఈ వ్యవహారంలో సుమారు 240 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు సీఐడీ గుర్తించింది!

ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టిన రూ. 370 కోట్లలో సుమారు రూ.240 కోట్లను వేర్వేరు షెల్‌ కంపెనీలకు మళ్లించిన‌ట్టు సీఐడీ అధికారులు నిగ్గుతేల్చారు. అయితే ఈ కుంభ‌కోణం 2016- 2018 మధ్య జ‌రగగా.. దీనిపై గతంలోనే ఏసీబీకి పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో నాటి ప్రభుత్వం సీమెన్స్ తో చేసుకున్న ఒప్పందానికి సంబంధించిన‌ అసలు ఫైళ్లను మాయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ సమయంలో అత్యంత కీలకంగా మారిన ఈ కేసులో ఇప్పుడు చంద్రబాబు ఏ-1గా ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు పై 120(బి), 166, 167, 201, 418, 420, 465, 468, 109, రీడ్‌ విత్‌ 34 మరియూ 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు ఏపీ సీఐడీ పోలీసులు. ఇదే క్రమంలో సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును శనివారం ఉదయం అరెస్ట్ చేశారు.