Begin typing your search above and press return to search.

సడెన్ గా ఢిల్లీకి చంద్రబాబు.....ఎందుకంటే...?

ఈ నేపధ్యంలో ఈసీకి దీని మీద ఫిర్యాదు చేసేందుకు బాబు ఢిల్లీ వెళ్తున్నారు అని అంటున్నారు

By:  Tupaki Desk   |   22 Aug 2023 11:58 AM GMT
సడెన్ గా ఢిల్లీకి చంద్రబాబు.....ఎందుకంటే...?
X

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేందుకు డేట్ ఫిక్స్ చేశారు. ఆయన ఈ నెల 28న ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన ఢిల్లీ టూర్ వెనక చాలా రాజకీయ వ్యూహాలే ఉన్నాయని అంటున్నారు. ఏపీలో ఓటర్ల జాబితా వెరిఫికేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల పాటు ఈ కార్యక్రమం సాగింది. అయితే అధికార పార్టీకే అనుకూలంగా అధికారులు వ్యవహరించారని, ఓటర్ల జాబితాలోని అవకతవకలు సరిగ్గా సరిచేయలేదని టీడీపీ సహా ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ఈ నేపధ్యంలో ఈసీకి దీని మీద ఫిర్యాదు చేసేందుకు బాబు ఢిల్లీ వెళ్తున్నారు అని అంటున్నారు. ఆ రోజున ఆయన కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల అధికారులను కలసి వినతిపత్రం సమర్పిస్తారు అని అంటున్నారు. అదే విధంగా ఆధారాలతో సహా అన్నీ ఈసీకి సమర్పిస్తారని అంటున్నారు.

ఏపీలో చాలా కాలంగా అధికార వైసీపీ,కి విపక్ష టీడీపీకి మధ్య ఓటర్ల జాబితా విషయంలో పెద్ద యుద్ధమే సాగుతోంది. దీని మీద అనేక ఫిర్యాదులు కూడా ఈసీకి వెళ్లాయి. దాంతో ఈసీ వెరిఫికేషన్ చేయాలని కోరింది. అయితే వైసీపీ తప్పుడు ఓట్లను పెద్ద ఎత్తున చేర్చిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఏపీలో దాదాపుగా ఇరవై లక్షల దాకా దొంగ ఓట్లు జమ అయ్యాయని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఆ మధ్య ఆరోపించారు.

అయితే టీడీపీయే అరవై లక్షల దాకా దొంగ ఓట్లను చేర్చిందని వైసీపీ ఆరోపించింది. ఈ వివాదం ఇలా సాగుతూండగానే ఓటర్ల వెరిఫికేషన్ జరిగింది. అయితే దీని మీద కూడా టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చింది. అధికారులు తమ మాటలను వినడంలేదని తప్పుడు ఓటర్లను తొలగించాలని చెప్పినా స్పందించడం లేదని కూడా విమర్శించారు.

ఇపుడు ఈ విషయాలు అన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికే తెలియచేయడానికి చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు అని అంటున్నారు. ఫలితంగా మరోసారి ఓటర్ల వెరిఫికేషన్ కోసం డిమాండ్ చేస్తారా అన్న చర్చ సాగుతోంది. అదే విధంగా పూర్తి స్థాయిలో ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాలని కోరతారు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు టూర్ పూర్తిగా ఈసీ కే పరిమితమా లేక ఢిల్లీలో బీజేపీ ప్రముఖులతో భేటీ అవుతారా అన్నది కూడా ఇపుడు చర్చకు వస్తోంది. గత నెలలో ఎన్డీయే మీట్ ఢిల్లీలో జరిగింది. దానికి బాబుకు ఆహ్వానం ఉంటుందని అంతా భావించారు. కానీ జరగలేదు. ఇక ఈ మధ్యేన విశాఖలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్డీయేలో కొత్త పార్టీలు చేరవచ్చు అని హింట్ ఇచ్చేశారు.

మరి ఆ కొత్త పార్టీ టీడీపీయే అని అంటున్నారు. దాంతో ఈసీ వద్దకు వెళ్తున్న బాబు పనిలో పనిగా బీజేపీ కేంద్ర పెద్దలతో కూడా భేటీ వేసే చాన్స్ అయితే లేకపోలేదు అని అంటున్నారు. ఏది ఏమైనా చాన్నాళ్ళ తరువాత బాబు చేస్తున్న ఢిల్లీ టూర్ ఆసక్తికరంగానే ఉంది అని చెప్పాలి.