Begin typing your search above and press return to search.

బాబు కేసులో సీబీఐ ఈడీ రంగంలోకి....?

చంద్రబాబు కేసులో కీలకమైన పరిణామాలు తొందరలో చోటు చేసుకోబోతున్నాయా అంటే ప్రచారం మాత్రం ఆ లెవెల్ లోనే ఉంది

By:  Tupaki Desk   |   13 Sep 2023 3:58 AM GMT
బాబు కేసులో సీబీఐ ఈడీ రంగంలోకి....?
X

చంద్రబాబు కేసులో కీలకమైన పరిణామాలు తొందరలో చోటు చేసుకోబోతున్నాయా అంటే ప్రచారం మాత్రం ఆ లెవెల్ లోనే ఉంది. ఏపీ సీఐడీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కేసుని ఆ మూల నుంచి ఈ మూల వరకూ ఆమూలగ్రం పూర్తి స్థాయిలో శోధించి సాధించి ఎట్టకేలకు సూత్రధారి చంద్రబాబు అని చెప్పి మరీ అరెస్ట్ చేసింది. ఆనక ఏసీబీ కోర్టు రిమాండ్ ని విధించి బాబుని రాజమండ్రి జైలుకు పంపించింది.

ఇపుడు ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగుతుందా అన్నది చర్చగా ఉంది. ఇలాంటి కేసులోలో మనీ లాండరింగ్ వ్యవహారం ఉంటే ఈడీ కచ్చితంగా దిగుతుంది ని అంటున్నారు. షెల్ కంపీనీలు డెబ్బై దాకా పెట్టారని అలాగే డబ్బు విదేశాలకు వెళ్లి అటు నుంచి తిరిగి కొంతమంది ఖాతాలలోకి వచ్చి చేరిందని సీఐడీ అభియోగం. అంటే ఈ కేసులో మనీ లాండరింగ్ ఉందని అంటున్నారు.

అలా చూసుకుంటే ఈడీ రంగ ప్రవేశం ఖాయమని అంటున్నారు. ఇక సీబీఐ ఒక కేసుని టేకప్ చేయాలీ అంటే ముఖ్యంగా ఆర్ధిక నేరాలలో పాతిక కోట్ల కంటే ఎక్కువ మొత్తాలలో కుభకోణాలు జరిగితే సీబీఐ రంగ ప్రవేశం చేసి విచారణ చేపట్టవచ్చు అంటున్నారు. ఇది సుమోటోగా చేయవచ్చు లేదా ఎవరైనా ఫిర్యాదు చేసినపుడు కూడా చేయవచ్చు అంటున్నారు.

ఇక్కడ చూస్తే 380 కోట్ల రూపాయలకు పైగా ఏపీ ఖజానా సొమ్ము గల్లంతు అయింది అని అంటున్నారు. వందల కోట్లలో అవినీతి జరిగింది కాబట్టి సీబీఐ ఈ కేసుని టేకప్ చేయవచ్చు అని అంటున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్తున్నారు అని అంటున్నారు. ఆయన కేంద్ర పెద్దలను కలుస్తారు అని తెలుస్తోంది.

అనేక అంశాలను కేంద్ర పెద్దలతో చర్చిస్తారు అని అంటారు. ఏపీలో మాజీ ముఖ్యామంత్రి దిగ్గజ నేత చంద్రబాబు అరెస్ట్ అంటే అది సామాన్య విషయం కాదు అనే అంటున్నారు. దాని మీద కచ్చితంగా కేంద్ర పెద్దలు ఆరా తీస్తారు. సీఎం కూడా దాని మీద చెబుతారు అని అంటున్నారు. ఇక ఈ కేసులో పూర్వపరాలు అన్నీ కేంద్ర పెద్దలకు వివరించి ఈడీ సీబీఐ ల దర్యాప్తుని జగన్ కోరే అవకాశం ఉంది అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది

ఒక ముఖ్యమంత్రి సీబీఐ దర్యాప్తు కోరిక్తే కచ్చితంగా కేంద్రం పాజిటివ్ గా స్పందిస్తుందని అలా సీబీఐ ఈడీ విచారణ జరిగే అవకాశం ఉంది అంటున్నారు. అదే విధంగా ఈ ఒక్క కేసు విషయమే కాకుండా రింగ్ రోడు స్కాం అని వైసీపీ చెబుతోంది. అలగే ఫైబర్ గ్రిడ్ కుంభకోణం అని అంటోంటి. ఒక ఆరేడు కేసులు గత ప్రభుత్వంలో కుంభకోణాలుగా ఉన్నాయని గుర్తించి తనదైన దర్యాప్తు సీఐడీ ద్వారా చేయిస్తోంది.

ఇపుడు వాటి మీద సీబీఐకి విచారణకు కోరవచ్చు అని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే ఏపీలో రాజకీయాలు మరింత కాక మీద ఉంటాయని అంటున్నారు. ఏది ఏమైనా రానున్న రోజులలో మాత్రం హాట్ హాట్ గానే ఏపీ పాలిటిక్స్ ఉండబోతున్నాయని అంటున్నారు.