బాబుపై కొత్త ట్రోల్ః అమరావతిలో అవమానం చేసిన సాల్వేనే దిక్కయ్యాడుగా!
చంద్రబాబు తరుఫున ఇప్పటికే అగ్రశ్రేణి లాయర్లు వాదిస్తున్నప్పటికీ, బెయిల్ దొరక్కపోవడంతో తాజాగా సాల్వే రంగంలోకి దిగారు
By: Tupaki Desk | 20 Sep 2023 4:49 AM GMTఏపీలో జరిగిన స్కిల్ స్కామ్‌లో నిందితుడిగా పేర్కొంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పేర్కొంటూ అరెస్టు చేయడం, ఆయనకు బెయిల్ ప్రయత్నాలు చేస్తే విఫలం అవడం, తాజాగా ఈ కేసులో సుప్రసిద్ధ న్యాయవాది హరీశ్ సాల్వే ఎంట్రీ ఇవ్వడం తెలిసిన సంగతే. ఇప్పటికే సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, తమదైన శైలిలో చంద్రబాబుకు బెయిల్ కోసం వాదిస్తుండగా లాయర్ హరీశ్ సాల్వే రంగంలోకి దిగారు. అయితే, సాల్వే గతంలో ఏపీ ప్రస్తుత సీఎం, వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ కోసం పలు కేసుల్లో వాదించిన న్యాయవాది కావడంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ జరుగుతోంది.
చంద్రబాబు తరుఫున ఇప్పటికే అగ్రశ్రేణి లాయర్లు వాదిస్తున్నప్పటికీ, బెయిల్ దొరక్కపోవడంతో తాజాగా సాల్వే రంగంలోకి దిగారు. కీలకమైన కేసులు వాదించి తన క్లయింట్లకు సానుకూల తీర్పు ఇప్పించడంలో పేరొందిన సాల్వే రోజుకు 15లక్షలు ఫీజ్ తీసుకుంటారని చర్చ ఉంది. అయితే, సాల్వే వల్ల ఏపీ సీఎం చంద్రబాబుకు బెయిల్ దక్కుతుందా లేదా అనే విషయం అటుంచితే, గతంలో ఆయన వైఎస్ఆర్‌సీపీ అధినేత కోసం పలు కేసుల్లో వాదించడం, పైగా ఇంకొన్ని కేసుల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా వాదనలు వినిపించడం ట్రోలింగ్‌కు కారణమైంది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మధ్య హాట్ హాట్‌గా వాదనలకు వేదికైన అమరావతిలో రాజధాని- భూ కుంభకోణం, మూడు రాజధానుల ఏర్పాటు అంశంలో సాల్వే కీలక న్యాయవాది. వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్ బెయిల్ కోసం 2013లో సాల్వే వాదించారు. ఏపీకి మూడు రాజధానులను ప్రవేశపెట్టాలనే తన చర్యను సమర్థించుకోవడానికి వైఎస్ జగన్ ముకుల్ రోహత్గీ, దివంగత రామ్ జెఠ్మలానీ సేవలు వినియోగించుకున్నారు. క్విడ్ ప్రోకో కేసులో జగన్ తరపున హరీశ్ సాల్వే వాదించారు. ఇప్పుడు ఇదే అంశంతో చంద్రబాబుపై ఆయన రాజకీయ ప్రత్యర్థులు కామెంట్లు చేస్తున్నారు.
అమరావతిని రాజధానిగా తొలగించే అంశంలో వ్యతిరేక వాదనలు వినిపించిన న్యాయవాది, భూకుంభకోణం అంశలో ప్రతిపక్ష గలం వినిపించిన న్యాయవాదే చంద్రబాబుకు ఇప్పుడు బెయిల్ ఇప్పించేందుకు దిక్కయ్యారని పలువురు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. 'ఒకే దేశం-ఒకే ఎన్నిక'పై అధ్యయం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో హరీశ్ సాల్వే సభ్యుడిగా ఉన్నారు కాబట్ట అంతటి సమర్థుడి వల్ల బాబుకు బెయిల్ దక్కవచ్చంటూ ఇంకొందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు.