Begin typing your search above and press return to search.

సీబీఎన్ 'స్టేబీఎన్' గా మారిన వేళ... 'స్టే'ల చరిత్ర ఇది!

కాగా... ఇప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును క్వాష్ చేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   2 Oct 2023 5:33 AM GMT
సీబీఎన్ స్టేబీఎన్ గా మారిన వేళ... స్టేల చరిత్ర ఇది!
X

సుమారు 41ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఇప్పటివరకూ అరెస్టైన దాఖలాలు లేవు! అంటే... ఆయన ఏ తప్పూ చేయలేదనా? అంటే... తప్పు చేయకపోతే అసలు కేసులే ఉండవు.. ఉన్నా కాల క్రమంలో అవి తప్పుడు కేసులు అని తేలిపోతాయి అనేది తెలిసిన విషయమే! అయితే చంద్రబాబుపై గతంలో చాలా కేసులు ఉన్నాయి! అయితే వాటన్నింటిలోనూ చంద్రబాబు స్టేలు తెచ్చుకుని నెట్టుకొచ్చారు.

చంద్రబాబుపై ప్రస్తుతానికి స్కిల్ డెవలప్ మెంట్, ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులతో పాటు అంగళ్ళు అల్లర్ల కు సంబంధించిన కేసులు రన్నింగ్ లో ఉన్నాయి! అయితే ఇవన్నీ చిన్న చిన్న పిట్ట కేసులు, అసలు కేసు వేరే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ఆ సంగతి అలా ఉంటే... ఇప్పటివరకూ చంద్రబాబుపై ఉన్న కేసులు, పెట్టిన నాయకులు, బాబు తెచ్చుకున్న స్టే ల వివరాలు తాజాగా పేర్ని నాని వెల్లడించారు.

తాజాగా చంద్రబాబు అరెస్టు, చినబాబుకు నోటీసులు, టీడీపీ కోసం పవన్ పడుతున్న కష్టాలు, మోత మోగిద్దాం కి స్పందన రాలేదు అనే విషయాలపై పేర్ని నాని స్పందించారు. ఇందులో భాగంగా... ఇప్పటివరకూ చంద్రబాబు తెచ్చుకున్న స్టేల వివరాలు విల్లడించారు. ఇదే సమయంలో... సిట్టింగ్ జడ్జితో మీ ఆస్తుల విచారణకు సిద్ధమా అంటూ ఛాలెంజ్ విసిరారు.

ఇందులో భాగంగా... 1997లో చంద్రబాబుపై రెడ్యానాయక్‌ అక్రమాస్తులపై కేసు వేస్తే అందులో బాబు స్టే తెచ్చుకున్నారు. అనంతరం... 1998లో వైఎస్సార్‌ హైకోర్టులో దావా వేస్తే అందులోనూ స్టే తెచ్చుకున్నారు. 1999లో షబ్బీర్‌ అలీ, 1999లో డీఎల్‌ రవీంద్రారెడ్డి వేసిన దావాలతోపాటు... 1999, 2000, 2001 వైఎస్సార్‌ మరోసారి వేసిన దావాల్లోనూ స్టేలు తెచ్చుకున్నారు చంద్రబాబు అని పేర్ని నాని తెలిపారు.

2003లో కృష్ణకుమార్‌ గౌడ్‌ తోపాటు ఇటీవల బీజేపీ నుంచి టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ కూడా.. పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్‌ పెట్టాడంటూ 2003లో దావా వేయగా.. అందులోనూ బాబు స్టే తెచ్చుకున్నారని.. అయినా పట్టువదలని కన్నా... 2004లో మళ్లీ కేసు వేస్తే, అందులోనూ బాబు స్టే తెచ్చుకున్నారని పేర్ని నాని తెలిపారు.

ఈ క్రమంలో అదే ఏడాది 2004లో పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి... చంద్రబాబుపై వరుసగా రెండు కేసులు వేశారని తెలిపిన నాని... వాటిల్లో ఒకటి అక్రమాస్తుల కేసు కాగా.. రెండోదీ భూదోపిడీ కి సంబంధించిన కేసు అని గుర్తు చేశారు. ఆ రెంటిలోనూ చంద్రబాబు స్టే తెచ్చుకున్నారని.. అదేవిధంగా... 2005లో బాబు అక్రమాస్తులపై ఆయన అత్తగారు లక్ష్మీపార్వతి హైకోర్టులో కేసు వేస్తే, అందులోనూ బాబు స్టే తెచ్చుకున్నారని వెల్లడించారు.

అదేవిధంగా... 2005 శ్రీహరి, అశోక్‌ అనే ఏపీ పౌరులు వేసిన కేసులోనూ.. 2011లో బి. ఎల్లారెడ్డి అనే వ్యక్తి వేసిన కేసులోనూ చంద్రబాబు స్టేలు తెచ్చుకున్నారని పేర్ని నాని గుర్తు చేశారు.

కాగా... ఇప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును క్వాష్ చేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్, పుంగళ్లు అల్లర్ల కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ లు కోర్టులో ఉన్నాయి!!