ఒకవేళ బాబుకు బెయిల్ వస్తే... వాట్ నెక్స్ట్?
అవును... ప్రస్తుతం చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై సుమారు నెల రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు
By: Tupaki Desk | 9 Oct 2023 9:24 AM GMTఒక కేసు అయితే ఓకే, ఒక పిటిషన్ అయితే డబుల్ ఓకే... వరుస కేసులు, వరుస పిటిషిన్లు, వాటికి ఏమాత్రం తగ్గకుండా వరుస షాకులు... లోపల చంద్రబాబుకు, బయట టీడీపీ శ్రేణులకు ఉక్కబోత తప్పడం లేదని... ఈ ఉక్కబోతముందు రోహిణీకార్తి ఎండలు అసలు పరిగణలోకే రావనే కామెంట్లు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. సపోజ్.. ఫర్ సపోజ్.. బాబు స్కిల్ స్కాంలో బెయిల్ వచ్చినా... వితౌట్ గ్యాప్ అదేబండిలో తిరుగు ప్రయాణం తప్పదనే మాటలూ వినిపిస్తున్నాయి.
అవును... ప్రస్తుతం చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై సుమారు నెల రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ సమయంలో తనకు ఈ కేసులో బెయిల్ కావాలని బాబు పిటిషన్ దాఖలు చేశారు.. దీనికి అనుగుణంగా చంద్రబాబు కస్టడీ కోరుతూ ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. రెండు కేసుల్లోనూ తీర్పు ఈ రోజు వెలువడే వకాశం ఉందని అంటున్నారు.
ఆ సంగతి అలా ఉంటే... ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్, అంగళ్లు అల్లర్ల కేసుల్లో బాబు దాఖలు చేసిన ముందస్తు పిటిషన్లలు ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఆ మూడు పిటిషన్లనూ కొట్టి వేసింది. ఇది అటు చంద్రబాబుకూ ఇటు టీడీపీ శ్రేణులకూ ఏమాత్రం జీర్ణించుకోలేని విషయం. మరోపక్క సుప్రీంలోనూ క్వాష్ పిటిషన్ పై వాదనలు జరుగుతున్నాయి.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో తనపై దాఖలైన ఎఫ్.ఐ.ఆర్. ను కొట్టివేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈ పిటిషన్ పై వాదనలు ప్రారంభించింది. ఇందులో భాగంగా... ఏపీ సీఐడీ తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గీ.. చంద్రబాబు తరపున హరీష్ సాల్వేతో పాటు అభిషేక్ మనుసింఘ్వి, సిద్ధార్థ్ లూథ్రా లు వాదనలు వినిపిస్తున్నారు.
అయితే ముందునుంచీ జరుగుతున్నట్లుగానే ఈ కేసులో 17 ఏ పైనే వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో వాదనలు ప్రారంభమైన అనంతరం లంచ్ తర్వాత పరిశీలిస్తామని బెంచ్ తెలిపింది.
ఆ సంగతి అలా ఉంటే... ఏసీబీ కోర్టులో లంచ్ తర్వాత స్కిల్ స్కాం లో బాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిన్ లపై తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఈ కేసులో బెయిల్ వస్తే ఏ మేరకు ఉపశమనం అనే చర్చ అటు రాజకీయవర్గాల్లోనూ, ఇటు న్యాయవాదుల సర్కిల్స్ లోనూ జరుగుతుందని తెలుస్తుంది.
అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు బెయిల్ వస్తే పెద్దగా ఒరిగే ప్రయోజనం ఉండదని అంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో బాబుకు ఒకవేళ బెయిల్ వస్తే... అనంతరం బయటకు వస్తే... కాసేపటికే పోలీసులు మళ్లీ అరెస్టు చేస్తారని అంటున్నారు. అందుకు కారణం... మూడు కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్స్ తిరస్కరణకు గురవ్వడమే.
ఎటూ ముందస్తు బెయిలు రాలేదు గనుక.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ చేస్తారు. మళ్లీ సేం స్టోరీ... రిమాండుకు వెళ్లాలి.. కోర్టు అనుమతిస్తే కస్టడీకి వెళ్లాలి.. సీఐడీ విచారణను ఎదుర్కోవాలి. అక్కడ కూడా బాబుకు కలిసొచ్చి మళ్లీ బెయిలు వస్తే... బయటకు రాగానే మళ్లీ ఫైబర్ గ్రిడ్ కేసులో అరెస్ట్ చేస్తారని అంటున్నారు.
ఈ రెండింటిలోనూ బెయిల్ వస్తే... సపోజ్, ఫర్ సపోజ్ వస్తే... చంద్రబాబు ఏ1 గా ఉన్న మరోకేసు పుంగళ్లు అల్లర్ల వ్యవహారం రెడీగా ఉంది. ఇలా వితౌట్ గ్యాప్... ఒకదాని తర్వాత ఒకటి చంద్రబాబుపై కేసులు వేళాడుతున్న నేపథ్యంలో... బాబు బయట ప్రపంచం చూడటం ఆల్ మోస్ట్ అసాధ్యం అనే మాటలు వినిపిస్తున్నాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ప్రస్తుతం ఏసీబీ కోర్టులో ఉన్న స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు బెయిల్ వస్తే జరిగే తదనంతర పరిణామాలు ఇవి అని ఒక అంచనా! అసలు ఆ కేసులోనే బెయిల్ రాకపోతే... వ్యవహారం మళ్లీ మొదటికి! ఈ లోపు మిగిలిన కేసుల్లోనీ పీటీ వారెంట్లు ఉండనే ఉన్నాయి! ఏది ఏమైనా... ఈ "మండే" రోజు బాబు కేసుల వ్యవహారంలో అత్యంత కీలకమైన రోజనే చెప్పుకోవాలి!