Begin typing your search above and press return to search.

బాబు కోసం... జైలు వద్ద ఫ్యామిలీ & మధురపూడిలో స్పెషల్ ఫ్లైట్!

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టై 52 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

By:  Tupaki Desk   |   31 Oct 2023 7:33 AM GMT
బాబు కోసం... జైలు వద్ద ఫ్యామిలీ & మధురపూడిలో స్పెషల్  ఫ్లైట్!
X

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టై 52 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ప్రొసీజర్ అంతా పూర్తయితే ఈరోజు సాయంత్రమే చంద్రబాబు విడుదల కానున్నారని తెలుస్తుంది. దీంతో కుటుంబ సభ్యులు రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్దకు చేరుకోనున్నారని తెలుస్తుంది.

అవును... స్కిల్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబుకు 52 రోజుల తర్వాత ఇవాళ మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఈ మేరకు హైకోర్టు తీర్పు కాపీని రాజమండ్రి జైలు అధికారులకు పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కాపీ అందిన తర్వాత రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు ఈరోజు సాయంత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో ఆయన తనయుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి ఇప్పటికే రాజమండ్రి చేరుకున్నారు!

ఇదే సమయంలో ఉత్తరాంధ్రలో "నిజం గెలవాలి" యాత్రను ప్లాన్ చేసుకున్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా కాసేపట్లో రాజమండ్రి చేరుకోబోతున్నారని అంటున్నారు. ఇప్పటికే రాజమండ్రి చేరుకున్న నారా లోకేష్, నారా బ్రాహ్మణి.. చంద్రబాబు విడుదల నేపథ్యంలో టీడీపీ క్యాంపు వద్ద వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. భువనేశ్వరి కూడా రాజమండ్రి చేరుకున్న అనంతరం ముగ్గురూ కలిసి సాయంత్రం బాబుని రిసీవ్ చేసుకోకున్నారని అంటున్నారు!

ఈ సమయంలో చంద్రబాబుకి బెయిల్ వచ్చిన విషయాన్ని లోకేష్ వద్ద నాయకులు ప్రస్తావించగా.. "ఆయన యుద్ధం ఇప్పుడు ప్రారంభం అయ్యింది" అని వ్యాఖ్యానించారని తెలుస్తుంది. అయితే... చంద్రబాబు విడుదల తర్వాత లోకేష్ ఈ రోజు సాయంత్రం తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉందని అంటున్నారు. మరోపక్క సుమారు నెల్లర రోజుల తర్వాత చంద్రబాబు బయట ప్రపంచలోకి రాబోతుండటంతో.. రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తిగా మారింది!

మధురవాడలో ప్రత్యేక విమానం సిద్ధం?:

అన్నీ అనుకూలంగా జరిగితే ఈ రోజు సాయంత్రం రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యాక అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి వెళ్లి వెంకన్న దర్శనం చేసుకునే అవకాశం ఉందనే చర్చ నడుస్తుంది. అది వీలుకానిపక్షంలో నేరుగా ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ వెళ్లిపోయే అవకాశాలున్నాయని అంటున్నారు.

అనంతరం ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో మరో రెండు రోజుల్లో చంద్రబాబు కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఆ ఆపరేషన్ అనంతరం ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైల్లో, సూపరిండెంట్ ముందు లోంగిపోవాల్సి ఉంటుంది.