Begin typing your search above and press return to search.

బాబుకు బెయిల్... అయినా ...?

అయితే బాబు రాజకీయ సమావేశాలు పెట్టకూడదు. పాల్గొనకూడదు, అదే విధంగా నేతలతో భేటీలు కూడా నిర్వహించకూడదు.

By:  Tupaki Desk   |   31 Oct 2023 9:16 AM GMT
బాబుకు బెయిల్... అయినా ...?
X

ఎట్టకేలకు చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయింది అది కూడా మధ్యంతర బెయిల్. వచ్చే నెల 28వ తేదీ అయిదు గంటలలోగా సాయంత్రానికి బాబు మళ్ళీ జైలుకు సరెండర్ కావాలి. ఇలా వచ్చిన కండిషనల్ బెయిల్ బాబుని జైలు నుంచి మాత్రమే బయటకు తీసుకుని వచ్చింది. ఆయన హైదరాబాద్ ఇంట్లో ఉండొచ్చు. అలాగే నచ్చిన ఆసుపత్రిలో కంటికి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు.

అయితే బాబు రాజకీయ సమావేశాలు పెట్టకూడదు. పాల్గొనకూడదు, అదే విధంగా నేతలతో భేటీలు కూడా నిర్వహించకూడదు. ఇదే ఇపుడు ఇబ్బందికరంగా ఉంది. బెయిల్ వచ్చిన తరువాత బాబు టీడీపీ నేతలతో మీటింగ్స్ పెట్టి పార్టీని మళ్లీ జనంలోకి తీసుకెళ్తారని అంతా ఆశగా చూస్తున్న వేళ ఆయన ఏ పని మీద బెయిల్ అడిగారో ఆ పని మాత్రమే చూసుకోవాలని కోర్టు ఆదేశించింది.

అంతే కాదు బాబు వెంట ఎపుడూ ఇద్దరు డీఎస్పీ అధికారులు ఉంటూనే ఉంటారు. అన్నీ గమనిస్తూనే ఉంటారు అలా బాబు రాజమండ్రి స్నేహా బ్లాక్ నుంచి తన హైదరాబాద్ ఇంటికి మాత్రం సేఫ్ గా షిఫ్ట్ చేయబడుతున్నారు.

ఇక బాబు డైరెక్షన్స్ మాత్రం పార్టీ నేతలకు ఏదో రూపంలో అందుతూ ఉంటాయి. అలాగే కుమారుడు లోకేష్ సతీమణి భువనేశ్వరికి బాబు దిశా నిర్దేశం చేస్తారు. వారి ద్వారా పార్టీ నేతలకు చేరాల్సిన సమాచారాన్ని చేరవేసి ఆ విధంగా పార్టీని నడిపించేందుకు ఒక అవకాశం ఉంటుంది.

అదే సమయంలో బాబు జైలులో ఉన్నారు అంటూ చెప్పుకుని కొవ్వొత్తుల ర్యాలీలు ఇతర సానుభూతి యాత్రలు చేసేందుకు మాత్రం ఈ నాలుగు వారాల పాటు అవకాశం మాత్రం టీడీపీ నేతలకు ఉండదు, ఇక పార్టీని జనంలోకి తీసుకుని వెళ్ళి పోరాడాల్సి ఉంది. బాబు ఇంట్లో కూర్చుంటే నేతలు రోడ్డు మీదకు రావాలి. నిజంగా బాబు ఎపుడూ ఇంట్లో కూర్చోలేదు. నేతలు కూడా పెద్దగా ఈ నాలుగేళ్ల కాలంలో రోడ్డు మీదకు రాలేదు

ఇపుడు అంతా రివర్స్ అన్న మాట. పైగా బాబు ఇంట్లో నుంచి అంతా చూస్తారు, గమనిస్తారు కాబట్టి తూతూ మంత్రంగా ఆందోళలను చేస్తూ సరి అనిపించే నేతలకు మాత్రం ఇపుడు ఇబ్బందే. ఇక బాబు నాలుగు వారాలా పాటు హాయిగా ఇంట్లో ఉంటారు కాబట్టి భారీ రాజకీయ వ్యూహాలను రూపొందించే అవకాశలు ఉండొచ్చు.

ఇక బాబుకు రెగ్యులర్ బెయిల్ మీద నవంబర్ 10న హైకోర్టులో విచారణ ఉంది. దాని కంటే ముందు సుప్రీం కోర్టు నవంబర్ 8న క్వాష్ పిటిషన్ మీద తీర్పు వెలువరించే అవకాశాలు ఉన్నాయి. క్వాష్ పిటిషన్ కొట్టేస్తే మాత్రం బాబు అండ్ కో కోరుకుంటున్న న్యాయం జరిగినట్లు. కేసు అక్రమంగా పెట్టారు అని ఎవరైనా చెప్పుకోవచ్చు.

అలా కాకుండా క్వాష్ పిటిషన్ ని కొట్టేస్తే మాత్రం బాబుకు జైలు బెయిల్ సమస్యలు అలాగే ఉన్నాయని అనుకోవాలి. ఇక రెగ్యులర్ బెయిల్ రాకపోతే మాత్రం బాబు మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అదే విధంగా మరి కొన్ని కేసులతో పాటు కొత్త కేసులు కూడా వెంటాడుతున్నాయి కాబట్టి బాబుకు ఇబ్బందులు కూడా వరసబెట్టి ఉంటాయని అంటున్నారు.

ఏది ఏమైనా బాబుకు అసలైన రిలీఫ్ ఎక్కడ అంటే క్వాష్ పిటిషన్ మీద అనుకూల తీర్పు వస్తేనే. లేకపోతే జైలు బాబు కాస్తా బెయిల్ బాబుగానే మారుతారు. అంటే కేసులలో బాబు ఉన్నారు ఏ వన్ అంటూ ప్రత్యర్ధి పార్టీలు జీవిత కాలం స్టాంప్ వేసే చాన్స్ ఎటూ ఉంటుంది. ఆదన్న మాట అసలు కధ.