అపుడే ఇన్ని యాక్షన్ సీన్లా చంద్రబాబూ...!?
తెలుగుదేశం అధినేత చంద్రబాబు చాణక్య రాజకీయం 2024 తరంలో వెలవెలబోతోందా అని చాలా సార్లు సందేహాలు వస్తున్నాయి
By: Tupaki Desk | 13 Jan 2024 2:45 AM GMTతెలుగుదేశం అధినేత చంద్రబాబు చాణక్య రాజకీయం 2024 తరంలో వెలవెలబోతోందా అని చాలా సార్లు సందేహాలు వస్తున్నాయి. చంద్రబాబు ఎపుడో నేర్చుకున్న పాలిటిక్స్ ఈ తరానికి నప్పడం లేదు అని అంటున్నారు. పార్టీలో అందరూ ఉండాలని అందరూ టీడీపీ కొమ్ము కాయాలని చెబుతూ అందరికీ హామీలు ఇస్తూ చివరికి వారిని మభ్యపెడుతూ ఎవరో ఒకరికి టీడీపీ టికెట్ ఖాయం చేయడం ఒక అలవాటుగా ఉంది.
దాంతో ఆ పార్టీని విమర్శిస్తూ బయటకు వచ్చే వారు చాలా మంది ఉన్నారు. అదే ఆది నిష్టూరం బెస్ట్ అన్నది వైసీపీ ఫిలాసఫీ. జగన్ అయితే మీకు టికెట్ ఇవ్వలేను అని కుండబద్ధలు కొడతారు. దాని వల్ల వారు బాధపడినా నమ్మించి మోసం చేశారు అని అనలేరు. చంద్రబాబు అయితే అందరినీ మ్యానేజ్ చేయగలను అని అనుకుని రాజకీయాలు చేస్తూ ఉండవచ్చు.
కానీ వర్తమానంలో అది సాధ్యపడడంలేదు అని అంటున్నారు. ఎందుకంటే ఎవరికి వారికే ఆశలు పెరిగిపోతున్నాయి. ఇపుడు కాకపోతే మరెప్పుడు అన్న ఆలోచనతోనే అంతా ఉంటున్నారు. దీంతో చంద్రబాబు మార్క్ స్ట్రాటజీ ఫలించకపోగా ఇబ్బందులను తెస్తోంది. ఇక తెలుగుదేశం విషయం చూస్తే ఇంకా టికెట్ల ఎంపిక అఫీషియల్ గా చేయలేదు. బుకింగ్ అయితే ఓపెన్ చేయలేదు.
లోపాయి కారీగా కొంతమందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పనిచేసుకోమని చెబుతున్నారు. దాంతో విష్జయం చేరిన వారు ఆయన మీద మండిపోతున్నారు. గుంటూరు జిల్లాలో చూస్తే మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు ఇప్పటిదాకా ఏ రాజకీయ నేత చేయని విధంగా చంద్రబాబు మీద తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ నిప్పులు చెరిగారు.
ఏకంగా గోడ మీద ఉన్న చంద్రబాబు ఫోటో తీసుకుని కోపంగా దాన్ని నేలకేసి విసిరికొట్టారు. ఈ సన్నివేశం ఇపుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది అధినేత మీద ఈ తీరున కూడా నిరసనలు ఉంటాయా అని అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు అధినాయకుడి తీరు నచ్చకపోతే విమర్శలు చేయడం సహజం కానీ ఇంతలా చేయడం అంటే వామ్మో అనిపించకమానదు.
ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఇంకా టీడీపీలో చాలా చూడాల్సి ఉంటుంది అని అంటున్నారు. నిజానికి ఎన్నికల వేళ టికెట్ల విషయం తేల్చడం చాలా కష్టం అని అంటున్నారు. ఒకరికి ఇస్తే మరొకరు అసంతృప్తి ఫీల్ అవుతారు టీడీపీలో చూస్తే ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు పోటీగా ఉన్నారు. అది చాలదు అన్నట్లుగా జనసేనకు ఇవ్వాల్సిన సీట్లు బీజేపీతో పొత్తు కూడా పెండింగులో ఉంది.
దాంతో సీటు రాని వారు చాలా మంది ఉంటారని అంటున్నారు. వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తూ మొత్తం 175 సీట్లలో అభ్యర్ధులను సర్దుబాటు చేసుకుంటేనే ఆ పార్టీకి నిరసనలు తప్పడంలేదు. అలాంటిది టీడీపీలో కచ్చితంగా ముప్పయి నుంచి నలభై దాకా సీట్లు పొత్తులో పోతాయి. మిగిలిన సీట్లలో కూడా వైసీపీ నుంచి వచ్చిన వారికి కూడా సర్దుబాటు చేయాలని చూస్తున్నారని టాక్.
మొత్తానికి చూస్తే తెలుగుదేశంలో సీట్ల సర్దుబాటు అతి పెద్ద తిరుగుబాట్లకు కారణం అవుతుంది అని అంటున్నారు. రాయపాటి మాత్రం సరికొత్త నిరసనతో టీడీపీకి అరుదైన యాక్షన్ ఎపిసోడ్ ని చూపించారు అని అంటున్నారు. ఇలాంటివి ఇంకా చాలా ముందు ముందు టీడీపీ చూడాల్సి ఉంటుంది అని అంటున్నారు.